Share News

సముద్రపు తాబేళ్లను పరిరక్షిద్దాం

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:38 AM

సముద్రపు తాబేళ్ల పెంపకానికి జిల్లా అటవీశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. సంతానాన్ని పెంచుకునేందుకు సుధూర ప్రాంతాల నుంచి తీరానికి వచ్చే తాబేళ్ల గుడ్లను సేకరించి హేచరీల్లో పిల్లల పెంపకం చేపట్టనున్నారు.

సముద్రపు తాబేళ్లను   పరిరక్షిద్దాం

తీరంలో మూడు హేచరీల ఏర్పాటు

50 వేల గుడ్లు సేకరణే లక్ష్యం

నేటి నుంచే సేకరణకు కసరత్తు

మత్స్యకారులకు అవగాహన

సముద్రపు తాబేళ్ల పెంపకానికి జిల్లా అటవీశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. సంతానాన్ని పెంచుకునేందుకు సుధూర ప్రాంతాల నుంచి తీరానికి వచ్చే తాబేళ్ల గుడ్లను సేకరించి హేచరీల్లో పిల్లల పెంపకం చేపట్టనున్నారు. ఈ ఏడాది మూడు హేచరీలను ఏర్పాటు చేయ్యటానికి అటవీ శాఖ సన్నాహాలు చేసింది. గత సంవత్సరం నుంచే సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తాబేళ్ల సంరక్షణ కోసం చర్యలు చేపట్టింది. అప్పట్లో ఏర్పాటు చేసిన హేచరీల్లో 15,600 గుడ్లను పొదింగించారు. గత ఏడాది కొంచెం జాప్యం జరిగింది. ఫిబ్రవరి నుంచి చేపట్టారు. ఈసారి ఈనెల 17నుంచి తాబేళ్ల గుడ్లను సేకరించి పొదిగించాలని నిర్ణయించింది. ఏడాది పొడవునా 50వేల గుడ్లు సేకరించాలని జిల్లా అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

భీమవరం టౌన్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా బియ్యపు తిప్ప్ఝనుంచి గొల్లపాలెం వరకు 17.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర తీరం ఉంది. ముఖ్యంగా ఆలీవ్‌రెడ్లీ తాబేళ్లు తీరానికి చేరుకుని ఇసుక తిన్నెల్లో గుడ్లను పెడతాయి. ఇక్కడే కొన్ని నెలల పాటు జీవించి ఆడ, మగ తాబేళ్లు సంపర్కం చేస్తాయి. గర్భం దాల్చి గుడ్లను ఇసుక తిన్నెలల్లో పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. గుడ్లు పొదిగి పిల్లలుగా మారి కెరటాలు వచ్చినపుడు పిల్లలు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని గుడ్లను రక్షించుకుని పిల్లను తయారుచేసేందుకు 3 హేచరీలను అటవీశాఖ సిద్ధంచేసింది.

మృత్యువాత పడుతున్న తాబేళ్లు

సంతాన ఉత్పత్తి కోసం తీరానికి వస్తున్న ఆలీవ్‌ తాబేళ్లు వలలకు, బోటును తాకి మృత్యువాత పడుతున్నాయి. సంతానోత్పత్తి కోసం వచ్చే తాబేళ్లు తీరం నుంచి 10 కిలోమీటర్లలోపు సంచరిస్తుంటాయి. లోపల మత్య్స కారులు వేట చేపట్టవద్దుంటు మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నారు. దీని పై రెవెన్యూ, మెరైస్‌, పోలీస్‌, అటవీశాఖల అధికారులు మత్స్స కారులతో సమావేశం కానున్నారు. సముద్రంలో 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వేట చేసుకోవాలని సూచించనున్నారు. వాస్తవానికి సముద్రంలో తాబేళ్లు జీవిస్తేనే సంపద పెరుగుతుంది. సముద్రంలోని పడగల దీవులకు ఉండే నాచును తింటూ తాబేళ్లు జీవిస్తూ ఉంటాయి. తాబేళ్ల దంతాల రాపిడితో సముద్రంలో ఆక్సిజన్‌ స్థాయి పెరుగుతుంది ఫలితంగా మత్స్య సంపద అధికం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే అధికారులు తాబేళ్లను పరిరక్షిస్తున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:38 AM