Share News

తక్షణం చెత్త తొలగించండి

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:58 AM

గోదావరి ఒడ్డున పురపాలక సంఘం వేస్తున్న చెత్తను తక్షణం తొలగించాలని బుధవారం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (సదరన్‌ జోన్‌) న్యాయమూర్తి పుష్ప సత్యనారాయణ ఆదేశించారు.

తక్షణం చెత్త తొలగించండి

నరసాపురం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గోదావరి ఒడ్డున పురపాలక సంఘం వేస్తున్న చెత్తను తక్షణం తొలగించాలని బుధవారం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (సదరన్‌ జోన్‌) న్యాయమూర్తి పుష్ప సత్యనారాయణ ఆదేశించారు.ఈ విషయాన్ని సోషల్‌ సమాజ సేవాకర్త ఓసూరి ఫణికర్‌ వెల్లడించారు. ఈ స్థలాన్ని మూడు నెలల్లో పూర్తిగా శుభ్రం చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఫణికర్‌ చెప్పారు. నరసాపురం పట్టణానికి చెందిన ఫణికర్‌ గోదావరి ఒడ్డున ఉన్న చెత్తను తొలగించాలని రెండేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. గతంలో ఢిల్లీలో ఉన్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అప్పటి తీర్పుకు అనుగుణంగా సదరన్‌ జోన్‌ నుంచి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు నరసాపురంలో పర్యటించారు.గోదావరి ఒడ్డున ఉన్న చెత్తను పరిశీలించి, పలు చోట్ల పొల్యూషన్‌ పరీక్షలు నిర్వహించారు. నది ఒడ్డున చెత్త వేయడం వల్ల గోదావరి జలాలు కలుషితం అవడంతో పాటు పరిసర ప్రాంతంలోని పంట కాల్వలు, గాలి కాలుష్యం అవుతున్నట్లు తేలింది. తక్షణం పురపాలకాన్ని ఆక్కడ చెత్త తొలగించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఆక్కడ ఉన్న 500 టన్నుల చెత్తను పురపాలక సంఘం రీసైకిలింగ్‌ చేసి పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం ఈ స్థలానికి ఎదురుగా ఉన్న మరో స్థలంలో చెత్త వేస్తున్నారు. అది కూడా నిండుకుంది. దీంతో 15 ఏళ్ల క్రితం నరసాపురం మండలం వేములదీవిలో కొనుగోలు చేసిన స్థలాన్ని తాత్కా లికంగా వినియోగించుకోవాలని పురపాలకం యోచి స్తున్నది. దీంతో పాటు మరికొన్ని స్థలాలను కూడా పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ట్రిబ్యునల్‌ ఆదేశాలతో చెత్తను ఎక్కడ వేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:58 AM