Share News

ఏలూరుకు వన్నె తెచ్చిన రేలంగి సుధారాణి

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:34 AM

ఏలూరు నగరానికి చెందిన రేలంగి సుధారాణికి అత్యున్నత పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎనిమిది మంది కేంద్ర సమాచార కమిషనర్లలో ఆమె ఒకరు.

ఏలూరుకు వన్నె తెచ్చిన రేలంగి సుధారాణి
రేలంగి సుధారాణి

నేడు ప్రమాణ స్వీకారం

(ఏలూరు/ఏలూరు రూరల్‌, ఆంధ్ర జ్యోతి): ఏలూరు నగరానికి చెందిన రేలంగి సుధారాణికి అత్యున్నత పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎనిమిది మంది కేంద్ర సమాచార కమిషనర్లలో ఆమె ఒకరు. ఏపీ నుంచి నామినేట్‌ అయ్యారు. ప్రస్తుతం పెట్రోలియం, సహజ వాయువుల రెగ్యులేటరీ బోర్డు(పీఎన్‌జీఆర్‌బీ) సభ్యురాలిగా ఉన్న ఆమెను సమా చార కమిషనర్‌గా నియమిస్తూ ప్రధాన మంత్రి మోదీ ఆధ్వర్యంలోని నియామ క కమిటీ సిఫార్సు చేసింది. ఇండియన్‌ లీగల్‌ సర్వీస్‌ అధికారి అయిన ఆమెకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, లెజిస్లెటివ్‌ డ్రాఫ్టింగ్‌, ప్రాసిక్యూషన్‌, ఇంటర్నేషనల్‌ కోఆప రేషన్‌ విభాగంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఇదివరకు సీబీఐలో ప్రాసి క్యూషన్‌ డైరెక్టర్‌గా, కేంద్ర న్యాయశాఖలో జాయింట్‌ సెక్రటరీగా పని చేశారు. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్సులో జడ్జి అటార్నీ జనరల్‌గా సేవలందిం చారు. సుధారాణి సమాచార కమిషనర్‌గా సోమవారం ప్రమాణస్వీకారం చేయను న్నారు. గతంలో ఏలూరు నగరానికి చెందిన రిటైర్డు ఐఏఎస్‌ దువ్వూరి సుబ్బా రావు రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌గా అత్యున్నత పదవిని నిర్వర్తించగా, సుధారాణి దేశంలోనే మరో అత్యున్నత పదవిని అందుకోవడం గమనార్హం.

వసంత మహల్‌ సెంటర్‌లో నివాసం

సుధారాణి స్వస్థలం ఏలూరు వసంత మహల్‌ సెంటర్‌. విద్యాభ్యాసం తర్వాత సుధారాణి ఏలూరును విడిచి వెళ్లారు. పాఠశాల విద్య నుంచి డిగ్రీ వర కు ఏలూరులోని సెయింట్‌ థెరిస్సా విద్యాలయంలో చదివారు. సీఆర్‌ఆర్‌ కళా శాలలో లా డిగ్రీ పూర్తి చేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ ఫైనాన్స్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ లాలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్‌ లీగల్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఆమెకు పదవి రావడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సమాచార కమిషనర్‌గా ఏలూరుకు చెందిన సుధారాణి రేలంగి నియమితులు కావడంపై గౌడ సంఘం నాయకుడు యిరకల సాంబశివరావు హర్షం ప్రకటించారు. సుధారాణికి ఈయన మేన మామ. ఆయనతో పాటు యిరకల సూరిబాబు, తదితరులు హర్షం ప్రకటిస్తూ భవిష్యత్‌లో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Updated Date - Dec 15 , 2025 | 12:34 AM