గట్టెక్కేదెలా!
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:45 AM
రిజిస్ర్టేషన్‌శాఖలో గత పదిహేను రోజుల నుంచి రిజిస్ర్టేషన్లు మందగించడంతో అధికారుల్లో గుబులు రేగుతోంది.
జిల్లాలో మందగించిన రిజిస్ర్టేషన్లు
రూ.287 కోట్లకు రూ.266 కోట్లే వసూలు..లక్ష్యంలో జిల్లా వెనుకబాటు
బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్న జనం
నూరుశాతం సాధనకు కసరత్తులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రిజిస్ర్టేషన్‌శాఖలో గత పదిహేను రోజుల నుంచి రిజిస్ర్టేషన్లు మందగించడంతో అధికారుల్లో గుబులు రేగుతోంది. ప్రధా నంగా బంగారం ధరల పెరుగుదలే రిజి స్ర్టేషన్లు తగ్గిపోవడం కారణంగా చెబుతు న్నారు. రొయ్యల చెరువు రైతులు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కూడా రిజిస్ర్టేషన్లపై ప్రభావం చూపు తోంది. దీంతో ఆదాయం పెంచేదెలా అంటూ జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ర్టార్లు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో రిజిస్ర్టేషన్ల ఆదాయం రూ.412 కోట్లు లక్ష్యం. ప్రతికూల పరిస్థితుల్లోను లక్ష్యాలను సాధించ డానికి ఆ శాఖ కసరత్తులు చేస్తోంది. డిసెంబరు 25వ తేదీ నాటికి జిల్లాలో రూ.287 కోట్లు ఆదాయం సాధించాల్సి ఉండగా రూ.266 కోట్లు రాబట్టారు. ఇంకా రూ.21 కోట్లు ఆదాయ ఆర్జనలో రిజిస్ర్టేషన్ శాఖ వెనుకబడి ఉంది. రాబోయే మూడు నెలల్లో 125 పైబడి ఆదాయం ఆర్జించాల్సి ఉంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఓవరాల్‌గా ఇప్పటి వరకు 96.51 శాతం లక్ష్యాలను స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ శాఖ సాధించింది. ఈపాటికే లక్ష్యాలను దాటి వెళ్లిపోవాల్సి ఉండగా వెనుకబాటుతో అధికారుల్లోనూ అలజడి రేగుతోంది. ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబి తాల్లోని భూములకు పరిష్కార మార్గాలు చూడ డంతో పాటు, ఇటీవలే వారసత్వ భూములను రూ.100తోనే రిజిస్ర్టేషన్లు చేసేలా ముందుకొచ్చినా ఆశించినంత మేర రిజిస్ర్టేషన్లు పెరగడం లేదు.
అధికారుల్లో అంతర్మథనం..
జూలైలో దూకుడు మీద ఉన్నట్టు కనిపించినా నవంబరు నుంచి భూ లావాదేవీలు అమాంతంగా పడిపోయాయి. ప్రతీరోజు జిల్లాలోని 12 కార్యాల యాల్లో 350 వరకు డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు జరు గుతుంటాయి. కొద్దికాలంగా కనీసం 250 రిజిస్ర్టేషన్లు సంఖ్య దాటడం లేదు. దీంతో అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్‌శాఖ డీఐజీ ఎన్. మాధవి జిల్లా కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి రికార్డులను తనిఖీలు చేశారు. దాదాపుగా వెయ్యి వరకు రిజిస్ర్టేషన్ల సంఖ్య తగ్గిందనే తాను పర్యవేక్షణకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. శాఖాపరంగా ఏమైనా లోపాలున్నాయా? ఇంకా ప్రజలు చేరువ కావాలని, వారి ఇబ్బందులుంటే వేగంగా పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
బంగారు బిస్కెట్లపై పెట్టుబడి
దసరా నుంచి బంగారం ధరలు అమాంతంగా పైపైకి వెళుతూ ఆకాశన్నంటుతున్నాయి. దీంతో రియల్ భూమ్‌పై ఎఫెక్టు పడింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల స్థలాలు, ప్లాట్‌లను కొనుగోలు చేయ డంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. కాసు బంగారం దసరా ముందు వరకు రూ.60 నుంచి రూ.70 వేలు ఉండగా, అది రూ.1.10 లక్షలకు చేరింది. ఇది కూడా రెండు లక్షలకు చేరుతుందన్న అంచనాలు సామాన్య, మధ్యతరగతి ప్రజల్ని బంగారం వైపే మళ్లింప చేస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు పైనే పెడుతున్నట్టు సమాచారం. చిన్న,చితకా స్థలాలు ఉన్నా కొనుగోలుదారులు లేకపోవడంతో రిజి స్ర్టేషన్ల ఆదాయం పడిపోయింది. సంవత్స రంలో రెట్టింపయ్యే పరిస్థితి బంగారం కుదువపైనే ఉండ డంతో ఈ దిశగానే ఆలోచన సాగుతోంది. దీంతో రిజిస్ర్టేషన్ల ఆదాయం పసిడి ఎఫెక్టు బలంగానే పడిందనే చె ప్పాలి.
రిజిస్ర్టేషన్లు తగ్గిన మాట వాస్తవమే
జిల్లాలో రిజిస్ర్టేషన్లు మందగించాయి. రియల్ భూమ్ పెద్దగా లేకపోవడం కారణంగా చూస్తున్నాం. రొయ్యల చెరువుల యజమానుల నష్టాలు చవిచూడడం వల్ల మనీ సర్క్యులేషన్ జరగడం లేదు. ప్రజలకు శాఖాపరంగా ఏమైన సేవల్లో లోపాలున్నాయా? ఏ విధంగా వారికి చేరువ కావాలన్న విషయాలపై సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. 478 జీవో విస్తృతమైన ప్రచారం చేస్తున్నాం. పార్టియేషన్ అయిన ఆస్తులకు రిజిస్ర్టేషన్ల పైన అవగాహన కల్పిస్తున్నాం. చాలా మంది ముందుకు వస్తున్నారు. లక్ష్యాలు అధిగమిస్తాం.
– కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ర్టార్