దళారులను ఆశ్రయించొద్దు
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:31 PM
‘రిజిస్ర్టార్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ప్రజలు, రైతులకు ఎదురవు తున్న సమస్యలపై చైతన్యం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. కార్టు 2.0 విధానం వల్ల పూర్తిస్థాయిలో సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా సేవలందిస్తున్నాం’ అంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ డీఐజీ ఎన్. మాధవి తెలిపారు.
రిజిస్ర్టేషన్ల సమస్యలపైౖ చైతన్యానికి చర్యలు
రిజిస్ర్టేషన్స్ డీఐజీ మాధవి ఆరా
ఏలూరు,డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : ‘రిజిస్ర్టార్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ప్రజలు, రైతులకు ఎదురవు తున్న సమస్యలపై చైతన్యం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. కార్టు 2.0 విధానం వల్ల పూర్తిస్థాయిలో సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా సేవలందిస్తున్నాం’ అంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ డీఐజీ ఎన్. మాధవి తెలిపారు. ఏలూరులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కక్షిదారుల ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. స్టాంప్స్ కార్యాలయ సిబ్బంది, ఆడిటింగ్ సిబ్బందితో సమీక్షించారు. మెరుగైన సేవలందించడానికి పలు సూచనలు చేశారు. కార్యాల యంలో స్టాంపులు, రికార్డులన్నింటిని తనిఖీ చేసి సం తృప్తి వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ‘ఈ సీజన్‌లో ఏలూరు జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంలో వెయ్యి వరకు రిజిస్ర్టేషన్లు తగ్గాయి. ఇప్పటి వరకు ఆదాయం లక్ష్య సాధనలో 66 శాతం ఈ కార్యాలయం సాధించింది. జిల్లాలో 77 శాతం టార్గెట్‌ను సాధించాం’ అని తెలి పారు. ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన పలు అంశాలపై ఆమె వివ రిస్తూ ఆటోమ్యుటేషన్ అమలు చేయడంతో రిజిస్ర్టేషన్లు వేగవంతం అవుతున్నాయని, దళారుల నియం త్రణపై స్పందిస్తూ వారిని ఆశ్రయించొద్దనే తాము చైతన్యం కల్పి స్తున్నామన్నారు. ల్యాండ్ కన్వర్షన్ జరిగిన వివరా లను తమ కార్యాలయానికి ఇవ్వాలని ఆర్డీవోలను, డీటీసీపీవో లను కోరుతున్నట్టు తెలిపారు. తద్వారా ఇతర భూముల రిజిస్ర్టేషన్లు వేగవంతం చేయడానికి వీలుంటుందని మాధవి అన్నారు. జిల్లా రిజిస్ర్టార్ కె.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.