సొంత గూడు కరువాయె !
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:24 AM
భూముల క్రయ, విక్రయాలతో నిత్యం కళకళలాడే రిజిస్ర్టేషన్ కార్యాలయాలు దశాబ్దాల తరబడి కనీస సౌకర్యాలకు దూరంగా ఉంటున్నాయి.

రిజిస్ర్టేషన్లశాఖకు భవనాల కొరత
అద్దె భవనాల్లోనే ఎనిమిది సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు
ఇరుకు గదులు.. వసతుల లేమి
కక్షిదారులకు నిత్యం సమస్యలే స్వాగతం
సొంత భవనాలు ప్రతిపాదనలతో సరి..
భూముల క్రయ, విక్రయాలతో నిత్యం కళకళలాడే రిజిస్ర్టేషన్ కార్యాలయాలు దశాబ్దాల తరబడి కనీస సౌకర్యాలకు దూరంగా ఉంటున్నాయి. ఏటా రూ.350 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆర్జించి పెడుతున్న ఈ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలోనైనా వీటి నిర్మాణాలపై దృష్టి పెట్టాలని కక్షిదారులు కోరుతున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని అందించే ప్రధానశాఖల్లో స్టాంపులు,రిజిస్ర్టేషన్ల శాఖ ప్రధాన మైంది. ఎంత ఆదాయం ఆర్జించి ఏ లాభం? కార్యా లయానికి సొంత భవనాల్ని సమకూర్చుకోలేని స్థితి లో ఈ శాఖ ఉంది. స్టాంపులు, రిజిస్ర్టేషన్‌శాఖ పరిఽ దిలోని సబ్– రిజిస్ర్టార్ కార్యాలయాలు 80 శాతం వరకు అన్ని ఇంకా అద్దె భవనాల నుంచే పాలన సాగిస్తున్నాయి. దీంతో నెలవారీ అద్దె చెల్లించడం భారంగా మారుతోంది. ‘మా కార్యాలయాలకు సొంత భవనాలు కట్టండి’ అని మొత్తుకుంటున్నా ఫలితం లేకుండా పోతోందని రిజిస్ర్టార్లు వాపోతు న్నారు.
ఎనిమిది చోట్ల అద్దె భవనాల్లోనే..
ఏలూరులోని జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంతో పాటు 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ సేవలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా రిజి స్ర్టార్ కార్యాలయం, పోలవరం,చింతలపూడి, కైక లూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు నాలుగు మాత్రమే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన ఎనిమిది చోట్ల ఇరుకు భవనాల్లో అరకొర వసతుల నడుమ అధికారులు, సిబ్బంది సేవలను అందిస్తున్నారు. క్రయ విక్రయదారులు కూర్చునేం దుకు కుర్చీలుండవు. మరుగుదొడ్లు అలంకార ప్రాయమే. ఏలూరు తర్వాత భీమడోలులో ఎక్కు వగా రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. ఇక్కడ పోలీస్ స్టేష న్ సమీపంలో సబ్ రిజిస్ర్టార్ ఆఫీసు ఉండేది. 25 ఏళ్ల క్రితం క్రితం శిథిలం కావడంతో ప్రభుత్వ స్థలం నిరుపయోగంగా ఉంది. జంగారెడ్డిగూడెం సబ్ రిజి స్ర్టార్ కార్యాలయం 66 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఇరుకు గదులతో కక్షిదారుల సహనానికి పరీక్షలు తప్పడం లేదు. దాత వాసా చిన అయ్యన్న 20 సెంట్లు విరాళంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇ చ్చారు. అధికారులు ఇక్కడ నిర్మాణానికి ప్రతిపాద నలు ఆమోదించుకోలేపోతున్నారు.గణపవరం, వ ట్లూరుల్లోని కార్యాలయాలు కొంత వరకు ఫరవా లేదు. కామవరపుకోటలో ఇరుకు గదుల నడుమ ఇరవై ఏళ్ల నుంచి అద్దె భవనంలోనే కార్యాలయం నడుస్తోంది. కక్షిదారులు రోడ్లపైనే గడపాల్సి వస్తోం ది. తాలూకా వ్యవస్థ సమయంలోనే కైకలూరు నియోజక వర్గంలో మూడు సబ్ రిజిస్ర్టార్ కార్యాల యాలున్నాయి. కైకలూరుకు మాత్రమే ప్రభుత్వ భవనం ఉండగా మండవల్లిలో వసతుల్లేని అద్దె భవనంలో సేవలను అందిస్తున్నారు. ముదినేపల్లి సబ్ రిజిస్ర్టార్ ఏర్పాటు చేసి 98 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి అద్దె భవనాల్లో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో 40 ఏళ్ల నుంచి సేవలంది స్తున్నారు. వర్షాకాలం వ స్తే ఆవరణ అంతా వర్షం నీరు నిండి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భవనం శిఽథిలావస్థకు చేరుకుంది. నూజివీడు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ఇరుకుగా ఉంది. చాలాకాలం నుంచి వేరే అద్దెభవనంలోకి మార్చాలని జిల్లా అధికారులు ఆదేశించినా మార్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. 15 ఏళ్లు క్రితం ప్రభుత్వం స్థలం కేటాయించినా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో అది మరుగున పడింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో ఎనిమిది చోట్ల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఇటీవల కొన్నింటిని వేరే భవనాల్లో మార్చాలని సూచించగా వసతులు ఉన్న అద్దె భవనాలు దొరడం లేదని సమాఽధానం వచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని.. మా ఉన్నతాధికారులు కోరుతూనే ఉన్నాం. వీటి కి అనుమతులు రావాల్సి ఉంది. ప్రభుత్వం, రెవెన్యూశాఖలు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వాల్సి ఉంది.
– కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ర్టార్