సమర్థవంతంగా గోదావరి పుష్కరాలు
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:46 AM
గోదావరికి 2027 జూన్ 26 నుంచి జూలై ఏడో తేదీ వరకు జరిగే పుష్కరాలను సమర్థవంతగా నిర్వహించేం దుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయా లని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవి. రమణ ఆదేశించారు.
ఆర్డీవో రమణ సమీక్ష
జంగారెడ్డిగూడెం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): గోదావరికి 2027 జూన్ 26 నుంచి జూలై ఏడో తేదీ వరకు జరిగే పుష్కరాలను సమర్థవంతగా నిర్వహించేం దుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయా లని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవి. రమణ ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్డీవో ఎంవి.రమణ అఽధ్యక్ష తన జంగారెడ్డిగూడెం డివిజన్ స్థాయి అధికారులతో 2027 గోదావరి పుష్కరాల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ‘2015 లో జరిగిన గోదావరి పుష్కరాలకు సుమారు 15 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఈ సారి అంతకంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం. డివిజన్ పరిధిలో పోలవరంలో 35 ఘాట్‌లు, కుక్కునూరులో మూడు, వేలేరుపాడులో ఐదు మొత్తం 43 పుష్కర ఘాట్‌లు ఉన్నాయి. ఇక్కడ అవసరమైన పనులకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందచేస్తాం’ అని తెలిపారు. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు, డీడీవో ఎం.రాజు, విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్, మునిసిపల్ కమిషనర్ కేవీ రమణ, తహసీల్దార్లు, సీఐలు,రవాణా శాఖ, పంచాయతీరాజ్, వైద్య, ఆర్‌అండ్‌బీ శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.