రేషన్ మాఫియా
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:58 AM
పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. గతంలో రేషన్ బియ్యా నికి ఉమ్మడి పశ్చిమలోని నల్లజర్ల, ఉంగుటూ రు డెన్‌లుగా ఉండేవి. అటువంటి దందా ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణానికి విస్తరిం చింది.
తాడేపల్లిగూడెం టు కాకినాడ
జోరుగా బియ్యం అమ్మకాలు
గూడెం కేంద్రంగా ఇతర జిల్లాల నుంచి భారీగా తరలింపు
కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో కఠిన చర్యలు
తనిఖీలు నామమాత్రం.. కట్టడికి అధికార యంత్రాంగం విఫలం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. గతంలో రేషన్ బియ్యా నికి ఉమ్మడి పశ్చిమలోని నల్లజర్ల, ఉంగుటూ రు డెన్‌లుగా ఉండేవి. అటువంటి దందా ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణానికి విస్తరిం చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. తర్వాత తర్వాత తనిఖీలు నామమా త్రం కావడంతో మళ్లీ మాఫియా రెచ్చిపో తోంది. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నేరుగా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఎగుమ తిదారులకు అమ్మకాలు జరిపి సొమ్ములు చేసుకుంటున్నారు. ప్రభుత్వం షార్టెక్స్ బియ్యం సరఫరా చేస్తుండడంతో ఎగుమతికి అనువుగా ఉన్నాయి. మిల్లర్లు 15 శాతం నూకతో ప్రభు త్వానికి బియ్యాన్ని అప్పగిస్తున్నారు.
ఇప్పుడు దందా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి జిల్లాలో కొనుగోలు చేయడానికి లేదు. కొనుగోలు చేసినా సరే తాడేపల్లిగూడెం దళారికి అప్పగించాలి. గూ డెంతోపాటు, ఇతర నియోజకవర్గాలకే కాకుం డా, ఇతర జిల్లాల నుంచి రేషన్ బియ్యాన్ని రప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు 25 లారీల్లో తాడేపల్లిగూడెం నుంచి కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని పక్కదారిపట్టకుండా అధికార యంత్రాంగం తనిఖీలు చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నా.. ఇది సరిపోవడం లేదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రేషన్ బియ్యానికి డిమాండ్
గతంలో తెలంగాణ నుంచి జిల్లా మీదుగా కాకినాడకు రేషన్ బియ్యం తరలివెళ్లేవి. తెలం గాణలో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం తో ఆ రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం దిగుమ తులు తగ్గిపోయాయి. జిల్లాలో డిమాండ్ పెరి గింది. వ్యాపారులు జల్లెడ పడుతున్నారు. లబ్ధి దారుల నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం తాజాగా రేషన్ షాపుల వద్ద బి య్యం తీసుకునేలా చర్చలు చేపట్టింది. వృద్ధు లకు మాత్రమే ఇంటింటికి తీసుకువచ్చి అంది స్తున్నారు. డీలర్ల నుంచి రేషన్ పక్కదారి పట్టే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఇటీవల విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయిన ప్పటికి తాడేపల్లిగూడెం వ్యాపారి దందా ఇతర జిల్లాల అధికారులకు తలనొప్పిగా మారింది.