Share News

వేసవిలో వర్షాలు!

ABN , Publish Date - May 27 , 2025 | 12:25 AM

రోహిణి కార్తెలో రోళ్లు పగులు తాయంటారు.. ప్రస్తుతం రోడ్లు మునుగు తున్నాయి. రెండు రోజుల క్రితమే రోహిణీ కార్తె ఆరంభమైంది.

వేసవిలో వర్షాలు!

35 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రత

తాడేపల్లిగూడెం రూరల్‌, మే26 (ఆం ధ్రజ్యోతి): రోహిణి కార్తెలో రోళ్లు పగులు తాయంటారు.. ప్రస్తుతం రోడ్లు మునుగు తున్నాయి. రెండు రోజుల క్రితమే రోహిణీ కార్తె ఆరంభమైంది. రెండు రోజుల నుంచే మబ్బుల వాతావరణంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షంతో రోడ్లు ముని గాయి. వేసవిలో ఎండ తీవ్రత, వడ గాడ్పులతో ప్రజలు అపసోపాలు పడతా రు. ఈ ఏడాది వేసవి వేడి ప్రజలకు పెద్దగా తగలలేదు. గత పది రోజులుగా ఉదయం కొంత వరకు ఎండ వేడిమి ఉన్నా రాత్రి వేళ వర్షంతో ఉక్కబోత లేదు. పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు దాట లేదు. రాబోయే వారం రోజులు చిరు జల్లులు పడే అవకాశం ఉందని వాతా వరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

Updated Date - May 27 , 2025 | 12:25 AM