కుంభవృష్టి
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:34 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో జిల్లాలో బుధ వారం వినాయక చవితి పండుగ రోజున మధ్యాహ్నం వరకు నానుడు వర్షాలు కురి సినా గురువారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి కుండపోతగా వర్షాలు కురి శాయి.
పల్లపు ప్రాంతాలు జలమయం
పొంగిన చెరువులు..
ముసునూరులో 135.4 మి.మీ వర్షపాతం నమోదు
ఉధృతంగా తమ్మిలేరు.. అధికారులు అప్రమత్తం
ఏలూరుకు వరద ముప్పు..
ఏలూరుసిటీ/పోలవరం/పెదవేగి/ముసు నూరు/ చాట్రాయి/ఏలూరురూరల్/ చింతల పూడి/ఆగిరిపల్లి/ నూజివీడు/ ఉంగుటూరు/ భీమడోలు/నూజివీడు టౌన్/కలిదిండి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో జిల్లాలో బుధ వారం వినాయక చవితి పండుగ రోజున మధ్యాహ్నం వరకు నానుడు వర్షాలు కురి సినా గురువారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి కుండపోతగా వర్షాలు కురి శాయి. జిల్లాలో జనజీవనం స్థంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు ముంపునకు గుర య్యాయి. ముసునూరు మండలంలో రహ దారులపై నీరు ఉధృతిగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
పోలవరం మండలంలో ఏకధాటిన వర్షం కురవడంతో ప్రజా జీవనం స్తంభించింది. కొత్త రామయ్యపేట పునరావాస కాలనీలో రోడ్డుపై చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం కలి గింది. కొండవాగుల జలాలు పొంగి ప్రవహి స్తున్నాయి. పెదవేగి మండలంలో పంటపొలా లు, రహదారులపై నీరు పారుతోంది. తహసీ ల్దారు డి.భ్రమరాంబ ఆయా గ్రామాల్లో పర్య టించారు. కూరగాయల పాదులకు నష్టం ఏర్పడిందని ఏవో శ్రీనివాస్ చెప్పారు. పెద వేగి– కూచింపూడి మధ్య న్యాయంపల్లి పెద ్దచెరువుకు వరదనీరు పోటెత్తడంతో అలుగు పొంగి ప్రధాన రహదారి పైనుంచి ప్రమాద కరంగా ప్రవహిస్తోంది. ఆయా గ్రామాల్లో అరటి, నిమ్మ, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో వర్షపునీరు చేరింది. వర్షాలకు జగన్నాఽథపురం దళితవాడలో మోర్ల గంగాజలం, దోమతోటి నాగమణిలకు చెందిన ఇళ్లు నీటమునిగాయి. ముసునూరు మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వలసపల్లి ప్రధాన రహదారి లో సంధ్య వాగు, నూజివీడు రహదారిలో రాములేరు, అక్కిరెడ్డిగూడెం రహదారిలో ఉన్న కట్టుకాలువ, రమణక్కపేట రహదారిపై మొండివాగు ఉధృతంగా ప్రహించడంతో గం టల తరబడి రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. చింతలవల్లి ఎంపీపీ పాఠశాల నీట మునగగా తరగతి గదుల్లోకి సైతం నీరు చేరింది. పల్లపు ప్రాంతాల్లో నివాస గృహాలు నీటమునిగాయి. వరి, పత్తి పంటలపై వర దనీరు ప్రహించడంతో స్వల్పంగా దెబ్బతిన్నా యి. ఆగిరిపల్లి మండలంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎగువన కురిసిన వర్షాలతో కుంపిని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండ డంతో ఆగిరిపల్లి, నూగుండపల్లి, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతిని తహసీల్దార్ ప్రసాద్, ఎస్‌ఐ శుభశేఖర్ పరిశీలించి వంతెనపై పోలీస్ గస్తీని ఏర్పాటు చేశారు. నూజివీడులో లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ కాలనీ, ఎమ్మార్ అప్పారావుకాలనీ, ఎమ్టీ రోడ్డులోని టెలిఫోన్ ఎక్సేంజ్ వద్ద ప్రధాన రహదారి నీటమునిగా యి. మంత్రి ఆదేశంతో పురపాలక సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. నూజివీడు పట్టణ పరిధిలోని హనుమాన్ జంక్షన్ రోడ్డులోని మొగళ్ళు చెరువు ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ వినూత్న గురువారం పరిశీలించారు. డ్రెయినేజీలకు అడ్డుపడిన సిల్ట్ తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పైకి వర్షం నీరు చేరి రోడ్లు చిధ్రంగా మారాయి.
ఉధృతంగా తమ్మిలేరు
అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. గురువారం సాయంత్రం 4.30 వరకు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1200 క్యూసెకులు ఉండగా తర్వాత వరద ఉధృతి పెరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి చిన్నంపేట తమ్మిలేరు కాజ్‌వే వద్ద ప్రమాదకర స్ధాయిలో ప్రవహిస్తోంది. వరద ఉదృతి కారణంగా చాట్రాయి మండలం కోటపాడు, చింతలపూడి మండలం పోతునూరు. మండలంలోని చీపురుగూడెం, చింతలపూడి మండలం మల్లాయగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయరాయి సమీపంలో తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 355 అడుగులు కాగా నీటి మట్టం 343 అడుగులకు చేరింది. తమ్మిలేరు 348 అడుగులు దాటితే దిగువకు నీరు విడుదల చేస్తారు. భారీ వర్షాలకు ముసునూరు మండల పరిధిలో తమ్మిలేరు ఉధృతంగా ప్రహిస్తోంది. గురువారం వరదనీటి ప్రవాహన్ని ఎంపీడీవో సత్యనారాయణ పరిశీలించారు. గుళ్ళపూడి, లోపూడి, యల్లాపురం, బలివే, వేల్పుచర్ల గ్రామాల్లో తమ్మిలేరు వద్ద రెవెన్యూ, పంచాయితీ, పోలీస్ సిబ్బందితో బందోస్తు ఏర్పాటు చేశారు. చింతలపూడి మండలంలో శివపురం వంతెనను ఆనుకుని తమ్మిలేరు వరద ప్రవహిస్తోంది
ఏలూరు నగరానికి తమ్మిలేరు వరద ముప్పు పొంచి ఉంది. నాగిరెడ్డిగూడెం జలాశయం నుంచి ఏలూరు వరకు తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నగరంలో తూర్పు, పశ్చిమ, తమ్మిలేరు పాయల్లో వరద నీరు ఉరకలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు శనివారపుపేట కాజ్‌వే కింద నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది మరింత పెరిగి కాజ్‌వే పై నుంచి ప్రవహించే ప్రమాదం ఉండడంతో వాహన రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
అప్రమత్తంగా ఉండాలి : మంత్రి సారథి
భారీవర్షాల కారణంగా ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, లోతట్టుప్రాంతంలో నివసించే ప్రజలు పట్ల అధికారులు అప్ర మత్తంగా వ్యవహరించాలని, ఏలూరుజిల్లా మంత్రి కె.పార్థసారథి, అధికారులకు స్పష్టం చేశారు. వరద విపత్తును ఎదుర్కొవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎంపీ పుట్టా
అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలు, గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ, గత అనుభవాలు నేపధ్యంలో ముందస్తు జాగ్త్రత్తలు తీసుకోవాలని అఽధికారులకు సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ వద్ద కంట్రోలు రూమ్ నంబర్ 1800–233–1077, 94910 41419లకు లేదా ఎంపీ కార్యాలయ నంబర్లు 96181 94377, 98855 19299 కు ఫోన్ చేయాలని సూచించారు.
వర్షపాతం వివరాలు..
గత 24 గంటలలో జిల్లాలోనే అత్యధికంగా ముసునూరు మండలంలో 135.4 మిల్లీ మీటర్లు వర్షసాతం నమోదైంది. జిల్లాలో సరా సరి వర్షపాతం 48.7 మి.మీగా నమోదైంది. కామవరపుకోట 100.2, పోలవరం 82, భీమడోలు 79.8, లింగపాలెం 73.4, ఏలూరు అర్బన్ 68.4, ద్వారకాతిరుమల 62.2, పెదవేగి 61.4, దెందులూరు 59.8, ఉంగుటూరు 58.4, ఏలూరు రూరల్ 51, చాట్రాయి 49.2, ముది నేపల్లి 48.8, చింతలపూడి 48.2, కుక్కునూరు 47.2, మండవల్లి 43.6, వేలేరుపాడు 39.8, ఆగిరిపల్లి 36.8, కైకలూరు 36.8, నిడమర్రు 28.4, కొయ్యలగూడెం 26.4, నూజివీడు 25.6, టి.నరసాపురం 25.2, పెదపాడు 24.6, జంగా రెడ్డిగూడెం 23, జీలుగుమిల్లి 17.4, బుట్టాయి గూడెం 6.6, కలిదిండి 3.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
మళ్లీ పెరుగుతున్న గోదావరి
కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం : వారం తిరగకుండానే గోదావరి నదికి మరోసారి వరద పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద 32 అడుగులు ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం రెండు గంటల వరకు 37అడుగులకు పెరిగి కొంతనిలకడగా ఉండి సాయంత్రానికి 39 అడుగులకు చేరింది. అయితే తెలంగాణలోని కామారెడ్డి, నిర్మల్, ములుగు, వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం అర్ధరాత్రికి మొదటి హెచ్చరిక స్థాయి 43 అడుగలకు చేరుకోవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు వంతెన మునిగిపోవడంతోపాటు వేలేరుపాడు, రుద్రమ్మకోట మధ్య కాజ్‌వేపై వరదనీరు చేరుకోవడంతో మొత్తం 18గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, దాచారం గ్రామాల మధ్య ఉన్న గుండేటివాగు లోలేవెల్‌కాజ్‌వే మరలా నీటమునగడంతో ప్రజలు వయా నల్లకుంట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రానికి అనూహ్యంగా పెరిగింది. పట్టిసీమ శివక్షేత్రం చుట్టూ వరద జలాలు ఆక్రమించాయి. కడెమ్మ స్లూయిజ్ వద్ద వరద జలాలు పెరగడంతో గేట్లు కొంతమేర మూసూకుపోయి ఏటిగట్టు కుడివైపున ఉన్న కొండవాగుల జలాల నీటిమట్టం పెరుగుతూ వస్తోంది.