కరుణించిన వరుణుడు
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:06 AM
శివారు ప్రాంతాలకు సాగు నీరందక ఆందోళన చెందుతున్న రైతులకు భారీ వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు.
మొగల్తూరు. జూలై 18 (ఆంధ్ర జ్యోతి): శివారు ప్రాంతాలకు సాగు నీరందక ఆందోళన చెందుతున్న రైతులకు భారీ వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు 44.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత రాత్రి కురిసిన వర్షానికి ఇటీవల వేసిన ఆకుమడులకు పూర్తిస్థాయిలో నీరందడంతో పాటు దమ్ము చేసిన చేలు వర్షానికి తడవడంతో రైతు సార్వా సాగు పనులు ప్రారంభించేందుకు సిద్ధ్దమయ్యారు. సకాలంలో సాగు నీరందక, వరుణుడు కరుణించక ఇప్పటి వరకూ సార్వా పనులు ఆలస్యమయ్యాయి. ఈవర్షంతో చేలల్లో నీరు నిలిచిపోవడంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో అస్తవ్యస్థంగా ఉన్న రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్ధానిక గొల్లగూడెం రోడ్డు, స్టేషన్ రోడ్డు, మొగల్తూరు కోట రోడ్డులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.