Share News

ఉండి–ఆకివీడు రోడ్డులో చురుకుగా ఆర్వోబీ నిర్మాణం

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:04 AM

ఉండిలో ఆర్వోబి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గురువారం నుంచి స్టీల్‌ గడ్డర్‌ పనులను చేపట్టారు.

ఉండి–ఆకివీడు రోడ్డులో చురుకుగా ఆర్వోబీ నిర్మాణం
ఆర్వోబీ పనుల్లో ఏర్పాటుచేసిన గడ్డర్స్‌

స్టీల్‌ గడ్డర్ల ఏర్పాటు పనులు

భారీ యంత్రాలతో పనులు

ఉండి, సెప్టెంబరు18(ఆంధ్రజ్యోతి): ఉండిలో ఆర్వోబి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గురువారం నుంచి స్టీల్‌ గడ్డర్‌ పనులను చేపట్టారు. ప్రాజెక్టు మేనజర్‌ యశ్వంత్‌కుమార్‌ పర్యవేక్షణలో ఈపనులను చురుకుగా సాంకేతిక ఇబ్బందులు లేకుండా ప్రణాళి కతో చేపడుతున్నట్లు తెలిపారు. గడ్డర్స్‌ను కింది నుంచి క్రేన్‌ సాయంతో పైకి తీసుకుని వెళ్లి వాటిని వంతెన రూపం తీసుకుని రావడం జరుగుతుందన్నారు. ఇం దుకోసం 6స్టీల్‌ గడ్డర్స్‌ను తయారుచేసి సిద్ధం చేశా మని, ప్రస్తుతం రెండు గిడ్డర్స్‌ అమర్చినట్లు చెప్పారు. నాలుగు రోజుల్లో 4 గడ్డర్స్‌ అమర్చనున్నట్లు చెప్పారు.

భారీ యంత్రాలు సిద్ధం

రైల్వేగేటుకు ఆనుకుని ఉండి వైపు ప్రాంతంలో మరోఖానా వేయడానికి భారీ యంత్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. యంత్రం సాయంతో డ్రిల్లింగ్‌ చేసి తదుపరి మిగతా పనులను పూర్తిచేస్తామన్నారు.

వాహనదారులకు ఇబ్బందులు

నిర్మాణ పనులపై ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా పనులను చేపట్టడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం రైల్వేగేటు తీసి ఉంచడంతో మోటార్‌సైకిల్‌పై కొందరు రాకపోకలు సాగించారు. తర్వాత కొద్ది సేపటికి మూసివేయడంతో వెళ్లిన వారు తిరిగి వచ్చిన వారు నిలిచిపోయారు. చుట్టు తిరిగి వెళ్లాల్సి వచ్చిందన్నారు. రైల్వేవారు ప్రయాణికులకు చెప్పడానికి ఎక్కడకక్కడ కొందరిని ఏర్పాటు చేశారు.

25 వరకు రైల్వేగేటు మూసివేత

రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులలో భాగంగా రైల్వేగేటును మూసివేశారు. ఈనెల 25 వరకు గేటు మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలి పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎట్టి పరిస్థితులలో గేట్‌ తీయడం జరగదన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు. ప్రయాణికులు, వాహనదారులు సహకారించాలని కోరారు.

వాహన రాకపోకలు మళ్లింపు

ఉండి–ఆకివీడులో రోడ్డులో ఆర్వోబి పనుల నిమిత్తం వాహనాల రాకపోకలు మళ్లించారు. భీమవరం నుంచి ఆకివీడు మీదుగా ఏలూరు వెళ్లే వాహనాలను ఉండి మీదుగా పాములపర్రు కోల మూరు, ఆరేడు నుంచి గణపవరం వైపు వెళ్ల నున్నాయి. ఆకివీడు నుంచి భీమవరం వైపు వాహ నాలు ఉండి నుంచి పెదపుల్లేరు మీదుగా సీసలి పెదమీరం మీదుగా భీమవరం వెళ్లనున్నాయి. వాహన రాకపోకలు మళ్లిస్తున్నట్లు ముందుగా సమాచారం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:04 AM