Share News

హమ్మయ్య.. లైన్‌ కదిలింది !

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:08 AM

ఏజెన్సీకి మరో మణిహారం. దశాబ్దాల కల నెరవేరబోతోంది. రాష్ట్రప్రభుత్వం చొరవ, కేంద్రం సహకారంతో భద్రాచలం– కొవ్వూరు రైల్వే లైనుకు మరింత కదలిక వచ్చింది.

హమ్మయ్య.. లైన్‌ కదిలింది !

భద్రాచలం– కొవ్వూరు రైల్వే లైనుకు కొత్తకళ

తాజాగా సిద్ధమైన డీపీఆర్‌

119 కి.మీ .. రూ.1695 కోట్లు

కలిసొస్తున్న కూటమి కృషి

ఏలూరు ఏజెన్సీకి మహద్భాగ్యమే

ఏజెన్సీకి మరో మణిహారం. దశాబ్దాల కల నెరవేరబోతోంది. రాష్ట్రప్రభుత్వం చొరవ, కేంద్రం సహకారంతో భద్రాచలం– కొవ్వూరు రైల్వే లైనుకు మరింత కదలిక వచ్చింది. ఈ నూతన మార్గం నిర్మాణానికి అనుగుణంగా డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సిద్ధమైంది. దాదాపు 70 కిలో మీటర్ల నిడివిన సుమారు రూ.1,695 కోట్ల వ్యయంతో ఈ రైల్వే లైన్‌ను నిర్మించాలని తాజాగా ప్రతిపాదించారు. కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం సాగేలా కేంద్ర, రాష్ర్టాలు మరింత చొరవ తీసుకుంటే ఈ ప్రాంతం భవిష్యత్‌లో సరికొత్త అభివృద్ధికి చేరువ కానుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

భద్రాచలం– కొవ్వూరు రైల్వేమార్గం.. అరవై ఏళ్లుగా వినిపిస్తూనే వచ్చింది. విశాఖ నుంచి గూడ్స్‌ రాకపోకలు అతి తక్కువ దూరంలో హైదరాబాద్‌ చేరేందుకు అవకాశం ఉన్న ఏకైక మార్గమిదే. దీని కోసం దాదాపు డజను సార్లకు పైగానే సర్వేలు సాగాయి. ప్రతీ ఎన్నికల్లోనూ ఈ రైల్వే మార్గమే అన్ని పార్టీల హామీ అయ్యింది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏలూరులో ఎంపీగా ఎవరున్నా, ఈ ప్రాజెక్టు చుట్టూనే అంతా సాగేది. లోక్‌సభ, రాజ్యసభల్లోనూ దాదాపు 35 సార్లకు పైగానే ప్రస్తావనకు వచ్చినా ఏకైక మార్గమిది. అయినా పట్టాలెక్కేం దుకు చాన్నాళ్లు అడ్డంకులు తొలగిపోలేదు. ఒకటికి రెండుసార్లు సర్వేలు కొనసాగుతూ వచ్చాయి.

2014–19 మధ్య కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యయ వాటాను భరించడానికి సిద్ధం అయ్యాయి. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు వీలుగా కేంద్ర ప్రతిపాద నలకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే వచ్చింది. ఈలోపే భద్రా చలం– కొత్తగూడెం మధ్య రైల్వే లైన్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపింది. సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనులు వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో రైల్వే అవసరాలు అనివార్యం అయ్యాయి. దీనికి తగ్గట్టుగానే భద్రాచలం నుంచి కొత్తగూడెం వరకు రైల్వే లైను నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం రూ.706 కోట్లు తన వాటాగా భరించేం దుకు ముందుకొచ్చింది. దీనికి సమాంతరంగా దక్షిణమధ్య రైల్వే మరో రూ.85 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం అయ్యింది. అనుకున్నదీ అనుకున్నట్లుగా సత్తుపల్లి వరకు రైల్వే రాకపోకలు ఆరంభమ య్యాయి. ఇక దీంతో ముంద స్తుగా ప్రతిపాదించిన భద్రాచలం– కొవ్వూ రు రైల్వే మార్గంలో కొంతభాగం నిర్మాణం పూర్తి అయ్యినట్లైంది. ఈ నేపథ్యంలోనే మిగతా రైల్వే లైను నిర్మాణం ఎప్పుడనేదే అందరి నోట నానుతూ వచ్చింది. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సైతం ఈ రైల్వే లైను ఎప్పుడు పూర్తి అవుతుందని లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. సుమారు 119 కిలోమీటర్ల నిడివిన నిర్మాణానికి గాను రూ.2,155 కోట్లు ఖర్చు అవుతాయని అప్పట్లో రైల్వేమంత్రి సభ సాక్షిగా సమా ధానం ఇచ్చారు. వాస్తవానికి ఈ రైల్వే మార్గంలో అవాంతరాలు తరచూ తలె త్తాయి. ఈ మార్గం పూర్తి చేయాల్సిందే నని రాష్ట్రం పదేపదే డిమాండ్‌ చేస్తూ వచ్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో అప్పట్లో వైసీపీ ఎంపీలు చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు.

ఇప్పుడేం జరగబోతుంది..

2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంతకు ముందెన్నడు లేని విధంగా రైల్వే లైన్లకు, విస్తరణకు అనుకూలంగా కేంద్రం స్పంది స్తోంది. రైల్వేశాఖ ఏపీ నుంచి వచ్చే ప్రతిపాదన లకు ఆమోదముద్ర వేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 12 మార్గాల్లో విస్తరణ, కొత్త మార్గాలకు డీపీఆర్‌లు సమర్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ లైన్లలో ప్రతిపాదనలకు తీవ్ర కసరత్తే జరిగింది. దానిలో భాగం గానే భద్రాచలం–కొవ్వూరు కొత్త రైల్వే లైనుకు డీపీఆర్‌ సమర్పించాలని నిర్ణ యించి సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి కొత్త రైల్వే లైన్‌ నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర వాటాలు అనివార్యం. భద్రాచలం– సత్తుపల్లి వరకు రైల్వే మార్గంలో ఇదే జరిగింది. మిగిలిన భాగం కొవ్వూరు వరకు 119 కిలోమీటర్ల నిర్మాణం చేయాల్సి ఉంది. తెలంగాణ ప్రాంతంలో 48.58 కిలో మీటర్లు, ఆంధ్రా ప్రాంతంలో 70.31 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే సర్వే పూర్త యింది. రకరకా లుగా సాగిన సర్వేల్లో ఆటంకాలన్నింటిని మదింపు చేశారు. సత్తుపల్లి నుంచి అశ్వా రావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డి గూడెం,పొంగుటూరు, చిన్నాయిగూడెం, దేవరపల్లి మీదుగా కొవ్వూరు వద్ద విశాఖ– విజయవాడ వెళ్లే మార్గంలో కొత్త రైల్వే లైను కలవనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు గాను ఇంతకు ముందే అమల్లో ఉన్న రాష్ట్ర వాటా కోసం దక్షిణమధ్య రైల్వే పట్టుబడుతుందా, కొత్త రైల్వే మార్గానికి పూర్తిగా అయ్యే వ్యయం పూర్తిగా కేంద్రం భరిస్తుందా, అనేది త్వరలో తేలనుంది.

ఈ కొత్త రైల్వే మార్గానికి సరైన సమయంలో అనుమతులు లభిం చేలా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌ ఏడాదిగా కేంద్ర మంత్రులను కలిసిన ప్రతీసారి తన నియోజకవర్గ తరపున అభ్యర్థిస్తూనే వచ్చారు. ప్రధాని నరేంద్రమోదీతో సహా పలువురు కేంద్రమంత్రులను ఒప్పించడంలో సీఎం చంద్రబాబు కూడా ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అరవై ఏళ్ల కాలంలో చివరి అంకంగా డీపీఆర్‌ సిద్ధమైంది. దీనికి ఆమోదముద్ర లభిస్తే రాబోయే మూడేళ్లలోనే కొత్తరైల్వే మార్గం నిర్మాణం కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణంతో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో కొత్త కళ సంత రించు కోగా అతి త్వరలోనే ఈ మార్గంలో రాకపోకలకు వీలుంది. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు సమాంతరంగానే కొత్త రైల్వే మార్గం నిర్మించనుండడం విశేషం.

Updated Date - Aug 11 , 2025 | 12:08 AM