Share News

రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్‌ విజేత ‘విశాఖ జట్టు’

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:55 PM

రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్‌ పోటీల విజేతగా విశాఖపట్నం జట్టు, రన్నర్‌గా హైదరాబాద్‌ జట్లు నిలిచాయి.

రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్‌ విజేత ‘విశాఖ జట్టు’
విశాఖపట్నం జట్టుకు ట్రోఫీ, నగదు అందిస్తున్న నిర్వాహకులు

భీమవరంటౌన్‌, డిసెంబరు28(ఆంధ్రజ్యోతి):రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్‌ పోటీల విజేతగా విశాఖపట్నం జట్టు, రన్నర్‌గా హైదరాబాద్‌ జట్లు నిలిచాయి. భీమవరం పట్టణంలోని డీఎన్నార్‌ కళాశాల క్రీడా మైదానంలో గత ఎనిమిది రోజులుగా జరు గుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్‌ పోటీల్లో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు, ట్రోఫీని దక్కించుకున్నారు. రన్నర్‌గా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు రూ.50 వేలు నగదు, ట్రోఫీని అందుకున్నారు. ఫైనల్స్‌ పోటీలో హైదరాబాద్‌ జట్టుపై విశాఖ పట్నం జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది.

విజేతలకు డీఎన్నార్‌ కళాశాల ఉపాధ్యక్షుడు గోకరాజు పాండు రంగరాజు, డాక్టర్‌ గౌతమ్‌ కుమార్‌ ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. అనంతరం విన్నర్‌గా నిలిచిన విశాఖపట్నం జట్టుకు సాగిరాజు అప్పలరాజు(సింగపూర్‌ అప్పన్న) అందించిన రూ.లక్ష నగదు, విన్నర్‌ ట్రోఫీని అందించి జట్టును అభినందించారు. రన్నర్‌గా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు డాక్టర్‌ గౌతమ్‌ కుమార్‌ అందించిన రూ.50వేలతోపాటు ట్రోఫీని అందించి జట్టు సభ్యులను అభినందించారు. బెస్ట్‌ బౌలర్‌గా హైదరాబాద్‌ జట్టులోని శ్రావణ్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా రాజమండ్రి జట్టులోని చిలకమర్తి సాయికుమార్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా హైదరాబాద్‌ జట్టులోని మొక్కరాల గౌతమ్‌కు అందించారు. ఫైనల్‌ పోటీలో మ్యాన్‌ఆఫ్‌ ది మ్యాచ్‌గా కొల్లూరి శరత్‌కు ట్రోఫీని అందించారు. నిర్వాహకులు చందూరి కామేష్‌, చెరుకుపల్లి సంతోష్‌, బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యం, బ్రహ్మజోశ్యుల ప్రసాద్‌, వేలూరి బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:55 PM