Share News

పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు పదోన్నతులు

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:19 AM

పంచా యతీరాజ్‌ ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది.

పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు పదోన్నతులు
పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులపై అంగీకార పత్రాలను స్వీకరిస్తున్న పశ్చిమ, ఏలూరు జిల్లాల డీపీవోలు

గ్రేడ్‌–1 కార్యదర్శులు, గ్రేడ్‌–2 ఈవోలు, వీడీవో, సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి

డిప్యూటీ ఎంపీడీవోలుగా అవకాశం

ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల నుంచి పదోన్నతికి అంగీకార పత్రాల స్వీకరణ

జడ్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్‌

ఏలూరు సిటీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పంచా యతీరాజ్‌ ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది. తొలుత గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్‌–2 ఈవోలు, వీడీవోలు, సీనియర్‌ అసిస్టెంట్లకు డిప్యూటి ఎంపీడీవో లుగా పదోన్నతి కల్పించనున్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఉద్యోగుల నుంచి అంగీకార పత్రాల స్వీకరణ చేపట్టారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా డీపీవోలు కొడాలి అనూరాధ, రామిరెడ్డి అంగీకార పత్రాలు స్వీకరించారు. గ్రేడ్‌ –1 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్‌–2 ఈవోలు, గ్రేడ్‌ –1 పంచాయతీలలో వీడీవోలతో పాటు డీపీవో, డీఎల్‌పీవో కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్ల నుంచి పదోన్న తులకు అంగీకార పత్రాలను తీసుకున్నారు.

పంచాయతీ రాజ్‌ సంస్కరణలలో భాగంగా అధిక జనాభా కలిగిన అర్బన్‌ పంచాయతీలకు వారిని డిప్యూటి ఎంపీడీవోలు, గ్రామ సచివాలయాల్లో మం డల స్థాయి అధికారులుగా నియమించనున్నారు. పంచాయతీరాజ్‌ సంస్కరణలలో భాగంగా ఇప్పటి వరకు 5 గ్రేడ్‌ల విధానాన్ని 4 గ్రేడ్‌లకు మార్పు చేశారు. స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలు (అర్బన్‌ పంచా యతీలు), గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, గ్రేడ్‌ 3 పంచాయతీలుగా విభజించారు. ఆయా పంచాయతీలలో కార్యదర్శులకు బదులు డిప్యూటి ఎంపీడీవోలుగా నియమితులవు తారు. ఈవోపీఆర్‌డీ వ్యవస్థ కనుమరుగు కానుంది. ఈవోపీఆర్‌డీ కేడర్‌నే డిప్యూటి ఎంపీడీవోలుగా మార్పు చేస్తున్నారు. తొలి విడతగా పంచాయతీ ఉద్యోగులకు పదోన్నతుల కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత మిగిలిన విభాగాల్లో చేపట్టనున్నారు. పంచాయతీ రాజ్‌లో సంస్కరణలతో పంచాయతీలు బలోపేతం అవుతాయని భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ ప్రారంభం కావడంలో ఎన్నికల పూర్తయ్యే సమయానికి పంచాయతీలను బలోపేతం చేయడం, గ్రామ పంచాయతీల్లో సౌకర్యాలను కల్పించ డం ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు.

కౌన్సెలింగ్‌కు 179 మంది

పదోన్నతుల కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లా వ్యాప్తంగా 179 మంది హాజరయ్యారు. గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శులు 143 మంది, గ్రేడ్‌ –2 ఈవోలు 20మంది, గ్రేడ్‌–1 పంచాయతీల్లో వీడీవోలు 13 మంది, డీపీవో, డీఎల్‌పీవో కార్యాలయాల్లో పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్లు ముగ్గురు హాజర య్యారు. బుధవారం జరిగిన అంగీకార పత్రాల స్వీకర ణకు సంబంధించిన నివేదికను పంచాయతీరాజ్‌ కమి షనరేట్‌కు పంపిస్తారు. రెండు జిల్లాల డీపీవోలతో పాటు ఏలూరు డీఎల్‌పీవో అమ్మాజీ, కార్యాలయ ఏఓ ఎంవి కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:19 AM