ప్రాజెక్టు రీస్టోర్
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:41 AM
ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొత్తు.. దొంగలపాలైనప్పుడు.. ఆ కుటుంబంలో విషాదం మాటల్లో చెప్పలేం. దొంగ పోలీసులకు పట్టుబడి.. చోరీ సొత్తు రికవరీ అయిందని తెలియగానే చెప్పలేని ఆనందం.
ఏలూరు జిల్లా ఎస్పీ శివకిశోర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..
బాధిత కుటుంబాల్లో ఆనందం..
ప్రతి నెలా నిర్వహిస్తామని ఎస్పీ వెల్లడి
ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొత్తు.. దొంగలపాలైనప్పుడు.. ఆ కుటుంబంలో విషాదం మాటల్లో చెప్పలేం. దొంగ పోలీసులకు పట్టుబడి.. చోరీ సొత్తు రికవరీ అయిందని తెలియగానే చెప్పలేని ఆనందం. అంతలోనే మన సొత్తు మనం తెచ్చుకునేందుకు ఎదుర య్యే అడ్డంకులు.. తలుచుకుంటే చెప్ప లేని భయం.. కోర్టుల చుట్టూ తిరిగేందుకు, అందుకయ్యే ఖర్చును ఊహించుకుంటే.. పోయిన వస్తువులపై ఆశ వదులు కోవడమే బెటర్ అనే పరిస్థితి.
ఇలాంటి వారి కష్టాలను తీర్చేందుకు ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కరోజే 729 మంది బాధితులకు రెండు కోట్ల 93 లక్షల 60 వేల సొత్తును అందజేశారు.
ఏలూరు క్రైం, డిసెంబరు 16(ఆంధ్ర జ్యోతి): పోలీసులు దొంగలను పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేసినా బాధితుల్లో సంతోషం కానరావడం లేదు. దీనిపై జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్ జిల్లాపై అధ్యయనం జరిపారు. ఎన్ని చోరీ కేసుల్లో దొంగలను పట్టుకున్నారు ? ఎంత చోరీ సొత్తు రికవరీ చేశారు ? ఆ సొత్తు ఎక్కడ ఉంది ? బాధితులకు అందించారా ? అంటూ ఆరా తీశారు. సాధారణంగా గతం నుంచి ఉన్న ఆనవాయితీగా కోర్టులో రిటర్న్ ఆఫ్ ప్రోపర్టీ పిటీషన్ దాఖలు చేసుకుని పొందకపోవడం వల్ల చోరీ సొత్తు ఇవ్వలేకపోతున్నామని స్టేషన్ రైటర్లు, అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకువ చ్చారు. ప్రస్తుతం ఉన్న నూతన బీఎన్‌ఎస్ చట్టాన్ని అనుసరించి చోరీ సొత్తును బాధితులకు నేరుగా అందించ డానికి ఎస్పీ శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు రీస్టోర్ పేరుతో మంగళవారం జిల్లావ్యా ప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ అయిన కేసుల్లోని రికవరీ చేసిన సొత్తును బాధితుల వద్దకు పోలీసులే వెళ్లి అప్పగించారు. పోలీసులు గ్రామా ల్లోకి, ఇళ్ల వద్దకు జీపులపై వచ్చి ఆగడం తో ఆ ప్రాంత ప్రజలందరూ ఒక్కసారి వింతగా చూశారు. ఏమి జరిగిందంటూ ఆలోచనలో పడ్డారు. కానీ పోలీసు అధి కారులు, సిబ్బంది చిరునవ్వుతో వారిని పలకరించి ఫలానా కేసులో మీరు పోగొ ట్టుకున్న చోరీ సొత్తు సొమ్ములు ఇవేనం టూ వాటిని చూపించి అప్పటికప్పుడు అందజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఏలూరు గవరవరంలో చెక్కా నాగలక్ష్మికి కొందరు బంగారం తక్కువ రేటుకు ఇస్తున్నామని చెప్పి రెండు లక్షలకు నకిలీ బంగారం అంట గట్టి గత నెల 27న సొత్తు అప హరించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ వి కోటేశ్వర రావు ఆద్వర్యంలో సొమ్మును రికవరీ చేశారు. సొమ్మును మంగళవారం ఎస్పీ కేపీఎస్ కిశోర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అందించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రతి నెలా నిర్వహిస్తాం : ఎస్పీ
బాధితులు తమ సొత్తు కోసం ఎంత గానో ఎదురుచూస్తూ ఉన్నారని వారికి అఫిడవిట్ ద్వారా సొత్తును అందిస్తున్నా మని, కోర్టు ట్రైల్ సమయంలో వారు వచ్చి నేరస్తుడికి శిక్షపడేలా వాగ్మూలం ఇచ్చుకుంటారని ఎస్పీ విలేకరుకు చెప్పారు. జిల్లాలో వివిధ కేసుల్లోని 729 మంది బాధితులకు రెండు కోట్ల 93 లక్షల 60 వేల రూపాయల విలువైన సొత్తును బాధితులకు అందించామన్నారు. వీటిలో ఒక కేజీ 20 గ్రాముల బంగారపు ఆభరణాలు (ఒక కోటి 32 లక్షల రూపాయలు), 30 ద్విచక్ర వాహనాలు, రెండు నాలుగు చక్రాల వాహనాలు, 647 మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను మంగళవారం ఏకకాలంలోనే బాధితులకు అందించడం జరిగిందన్నారు. ప్రతి నెలా ఒక రోజున జిల్లాలో ప్రాజెక్టు రీస్టోర్‌ను అమలు చేస్తామని తెలిపారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుశ్మిత, పోలవరం, నూజివీడు, ఏలూరు డీఎస్పీలు ఎం.వెంకటేశ్వరరావు, ప్రసాద్, డి.శ్రావణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో చోరీ సొత్తు, నగదు, వాహనాలను బాధితుల ఇళ్లకు వెళ్లి అందించారు.
మా ఆనందం మాటల్లో చెప్పలేం
‘మేం నకిలీ బంగారం కొని మోసపోయి పోగొట్టుకున్న రెండు లక్షలు ఇక రావను కున్నాం. కాని, ఈ రోజు జిల్లా ఎస్పీ కిశోర్ సార్ మా ఇంటికి వచ్చి ఆ సొమ్మును ఇవ్వడంతో ఎంతో ఆశ్చర్యపోయాం. మా కుటుంబ సభ్యుల ఆనందం మాటల్లో చెప్పలేం. జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది’ అంటూ ఏలూరు గవరవరం లోని చెక్కా నాగలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.