లాభసాటి వ్యవసాయం ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 22 , 2025 | 12:18 AM
తక్కువ ఖర్చుతో రైతుల కు లాభసాటి వ్యవసాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ప్రత్యేకాధికారి, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్సి అజయ్ జైన్ అన్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రత్యేకాధికారి అజయ్ జైన్
ఉండి, మే 21(ఆంధ్రజ్యోతి): తక్కువ ఖర్చుతో రైతుల కు లాభసాటి వ్యవసాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ప్రత్యేకాధికారి, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్సి అజయ్ జైన్ అన్నారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామ సచివాలయాన్ని బుదవారం ఆయన పరిశీలించారు. అధి కారులతో సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యా గారానికి పుట్టినిల్లు అన్నారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని, ఎస్సీ పేటలో లేఅవుట్లు, గ్రామసచివాలయం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. లాభసాటి వరి వంగడాలు అందించడానికి శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం కృషిచేయాలని సూచించారు. పరిశోధనలను విస్తృతం చేసి రైతులకు మేలైన వరి, హార్టికల్చర్ వంగడాలను అందించాలని సూచించారు. మిల్లెట్‌ల సాగు, అంతర పంటల సాగుపై రైతులలో అవగాహన కల్పించాలని సూచించారు. మహ దేవపట్నంలో డంపింగ్‌యార్డు పరిశీలించి సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాళ్లకోడు కాలనీ సమస్యలపై దృష్టి
ఆకివీడు రూరల్: తాళ్లకోడు కాలనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రత్యేకాధికారి అజయ్ జైన్ అన్నారు. కుప్పనపూడిలోని తాళ్లకోడు ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు. కాలనీ లో సుమారు 950 మంది ఇళ్లు నిర్మాణం పూర్తిచేసుకుని నివసిస్తున్నారు. మరో 1400 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు, వీధి దీపాలు లేక ఇబ్బం దులు పడుతున్నామని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ఆకివీడు పట్టణానికి చెందిన తమకు ఈ ఊరిలో స్థలం ఇచ్చారన్నారు.
భీమవరం పట్టణ పర్యటన
భీమవరం టౌన్: పట్టణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రత్యేకాధికారి అజయ్ జైన్ పర్యటిం చారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరును పరిశీలించడానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అందుతు న్న సేవలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గును పూడిలో అంగన్‌వాడీ కేంద్రం సందర్శించి పిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలన్నారు. చిన్నా రులకు విద్యాబుద్ధులు నేర్పించడంపై శ్రద్ధ చూపాల న్నారు. ఆయన వెంట కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ అప్పా రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.పిచ్చియ్య, డీఎల్‌డీవో దోసిరెడ్డి, సర్పంచ్‌లు వనిమా సుబ్బలక్ష్మి, ముత్యాల అ నూరాధ, మోటుపల్లి రామవరప్రసాద్, ముత్యాల రత్నం, గొంట్లా గణపతి, బొల్లా వెంకట్రావు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
టీ పెట్టిన అజయ్ జైన్
భీమవరం పట్టణం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారు ఇంట్లో అజయ్ జైన్ దీపం స్వయంగా టీ తయారుచేశారు. తాను పెట్టిన టీ దీపం లబ్ధిదారుతో పాటు జిల్లా అధికారులకు అందించి ఆశ్చర్యం కలిగించారు. కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి టీ బాగుందని అభినందించారు. పేద మహిళలకు ఆర్థిక ప్రయోజనం సమకూర్చేందుకు ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందని, సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తుందన్నారు.