Share News

కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:03 AM

కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఐక్యతతో కృషి చేద్దామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అన్నారు.

కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, ధర్మరాజు

సమస్యలు నివేదించండి

చేపల రైతుల సంఘం, కొల్లేరు ప్రజల ఐక్యవేదిక సదస్సు

ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మరాజు సూచనలు

కైకలూరు, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి ఐక్యతతో కృషి చేద్దామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అన్నారు. కైకలూరులో రాష్ట్ర చేపల రైతుల సంఘం, కొల్లేరు ప్రజల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొల్లేరు గ్రామాల ప్రజలు, రైతుల అవగాహన సమావేశం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ త్వరలో కొల్లేరులో కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) పర్యటించనుందని, కొల్లేరు ప్రజల సమస్యలను కమిటీకి నివేదించాలన్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని కొల్లేరు గ్రామాల నుంచి పూర్తి సమా చారాన్ని సేకరించాలని సమావేశంలో పేర్కొన్నారు. కొల్లేరు సరస్సులోని 14,800 ఎకరాల జిరాయితీ భూములు 7,100 ఎక రాలు డీఫామ్‌ పట్టాలను కచ్చితంగా తిరిగి ప్రజలు, రైతులకు అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు జీవనో పాధి కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కాంటూరు కుదింపు సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పిందని, ఒక జిరాయితీ, డీఫామ్‌ పట్టాలను మాత్రమే మనం కాంటూరు నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీని సాధనకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, ఎంపీలు పుట్టా మహేశ్‌కుమార్‌, పాకా వెంకట సత్యనారాయణ, ఐదు నియోజ కవర్గాల ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నామన్నారు. గ్రా మాల వారీగా వివరాలను అందరూ సేకరించి త్వరి తగతిన అప్పగించాలని సూచించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ సీఈసీ కమిటీ వచ్చిన సమయంలో ప్రజలంతా మౌలిక సదుపాయాలను అడగాలని, కమిటీ స్పందించేలా నడుచుకోవాలన్నారు. అందరూ కలిసిగట్టుగా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి అందించాలన్నారు. కొల్లే రు సరస్సులో వాస్తవ సంఘటనలు, వాజ్యాల పత్రా ల సంకలనంతో పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన మాచవరపు నాగ సత్యగంగాధరం తయారుచేసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చేపలరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు, నంబూరి శివాజీరాజు, ఘంటసాల వెంకటలక్ష్మి, కమ్మిలి విఠలరావు, కన్వీనర్‌ బలే ఏసురాజు, సైదు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 01:03 AM