Share News

పశ్చిమలో పచ్చదనం

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:45 PM

పశ్చిమలో పచ్చదనానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మొక్కల పెంపకానికి జాతీయ గ్రామీణ ఉపాధి నిధులను వినియోగించనుంది.

	పశ్చిమలో పచ్చదనం

జాతీయ ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకానికి ప్రణాళిక

అటవీ శాఖకు న ర్సరీ బాధ్యతలు

ఈ ఏడాది 5.6 లక్షలు, వచ్చే ఏడాదికి 11 లక్షల మొక్కల పంపిణీ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పశ్చిమలో పచ్చదనానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మొక్కల పెంపకానికి జాతీయ గ్రామీణ ఉపాధి నిధులను వినియోగించనుంది. నర్సరీల బాధ్యతను అటవీ శాఖకు అప్పగించింది. ఇందుకు రూ.45 లక్షలు వెచ్చించింది. ఈ ఏడాది 5.6 లక్షల మొక్కలను పంపిణీ చేసేందుకు అటవీ శాఖ సన్నా హాలు చేసింది. జిల్లాలో అటవీ ప్రాంతం లేకపోయి నప్పటికీ జిల్లాల పునర్విభజన సమయంలో పశ్చిమ కు అటవీ అధికారులు, సిబ్బందిని నియమించారు. గత ప్రభుత్వంలో అటవీ శాఖకు పనిలేకపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలను పెంచేందుకు కసరత్తు చేసింది. మొక్క లను అటవీ శాఖ సరఫరా చేయనుంది. జూన్‌ 4 పర్యావరణ దినోత్సవం రోజున 25 వేల మొక్కలను పంపిణీ చేసి నాటనున్నారు. మిగిలిన మొక్కలు వర్షాకాలంలో నాటనున్నారు. వచ్చే ఏడాది 11 లక్షల మొక్కలను పెంచనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వేప, మర్రి, రావి, నేరేడు వంటి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాణవాయువు వృద్ధి చెందుతుంది.

Updated Date - Jun 02 , 2025 | 11:45 PM