ప్రైవేటు ఆలయాల్లో.. భద్రత ఎంత?
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:49 AM
జిల్లాలో ప్రైవేట్ ఆలయాల నిర్వహణ, భద్రతపై దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు ఆరా తీస్తు న్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వ రస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం
జిల్లాలో దేవదాయశాఖఅధికారులు, ఇన్‌స్పెక్టర్లు ఆరా
నెలాఖరు నాటికి తుది నివేదిక సిద్ధం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రైవేట్ ఆలయాల నిర్వహణ, భద్రతపై దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు ఆరా తీస్తు న్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వ రస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్న దేవదాయ శాఖ ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలోని ఆలయాల్లో భద్రత పెంచే విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిం ది. ప్రతీ జిల్లాలో అటువంటి ఆలయాల సమాచారాన్ని సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా వ్యాప్తంగా భక్తిభావం పెరిగింది. దాతల వితరణ శక్తి పెరిగింది.వివిధ జాతరలు, ఉత్సవాల పేరిటే ఏదో మూల దేవాలయాల్లో ప్రత్యేక ఆరాధ నలు జరుగుతుంటాయి. ప్రధానంగా దాతలు, భక్తు లు సేకరించిన విరాళాలతో దేవాలయాలను నిర్మించిన ఘటనలు కోకొల్లలు. మరోవైపు కాల్వగట్లు, ఏటిగట్లు ప్రాంతంలో ఇష్టారాజ్యంగా వెలిసినవి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలో దేవాలయాలు, సత్రాలు, మఠాలు కలుపుపుకుని 716 ఉన్నాయి. వీటి నిర్వహణను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టింది. సీసీ కెమెరాల నిఘాను విస్తరిం చడం, సిబ్బంది పెంపు, ఆలయాల్లో అర్చకులు వేత నాలు పెంపును చేపట్టింది.
ఉత్సవాలపై నిఘా
జిల్లా దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ దేవా లయాల వివరాలు లేదు. మరోవైపు ప్రముఖ దేవా లయాలుగా విరాజిల్లుతున్న ప్రైవేట్ ఆలయాల్లో కనీసం వెయ్యి మంది పైగా భక్తులు వచ్చే వాటి వివరాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆలయాల డేటా లేకపోవడంతో సచివాలయ సిబ్బంది ఆఽధా రంగా దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వ దేవాలయాల మాది రిగానే క్యూలైన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విశాల మైన ప్రహారీలు, సిబ్బంది నియామకం జరిగేలా ప్రభుత్వ విధి, విధానాలు రూపొందించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏయే ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు, బ్రహోత్సవాలు జరుగుతాయో వాటి వివరాలను రికార్డు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో దేవాలయాల సంఖ్యను నిర్ధారించే అవకాశం ఉందని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు.