Share News

ఐఎంఏ యాప్‌లో తపాలా సేవలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:52 PM

తపాలా శాఖ న్యూ జనరేషన్‌ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ పోస్టల్‌ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది.

ఐఎంఏ యాప్‌లో తపాలా సేవలు
ఏపీటీ కౌంటర్‌ ప్రారంభించిన ఎస్పీవో శ్రీకర్‌బాబు

ఏపీటీ 2.0 సాఫ్ట్‌వేర్‌తో నవశకం

జిల్లాలోని 257 పోస్టాఫీసులు అనుసంధానం

ఏలూరులో ప్రారంభించిన ఎస్పీవో శ్రీకర్‌బాబు

ఏలూరు అర్బన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తపాలా శాఖ న్యూ జనరేషన్‌ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ పోస్టల్‌ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఏపీటీ 2.0 (అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాల జీ)సేవలను జిల్లావ్యాప్తంగా 257 పోస్టాఫీసుల్లో అందుబాటులోకి ఉన్నట్లు తపాలా కార్యాలయాల సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీకర్‌బాబు వెల్లడించారు. స్థానిక హెడ్‌ పోస్టాఫీసులో ఏపీటీ 2.0 విధానాన్ని జిల్లాలోని అన్ని పోస్టాఫీసులకు అనుసంధానించే సాఫ్ట్‌వేర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం తపాలా సేవలన్నీ నూరుశాతం వెబ్‌ ఆధారిత క్లౌడ్‌ టెక్నాలజీలో లభిస్తాయన్నారు. ఏపీటీ 2.0 విధానంలో సైబర్‌ నేరాలను నియంత్రణ, వాటిపై నిఘా ఉంటాయన్నారు.

ఇంటి వద్ద నుంచి పోస్టల్‌ సేవలు

వినియోగదారులు, ఖాతాదారులు ఏపీటీ సేవల ను పొందడానికి మొబైల్‌ఫోన్ల ద్వారా గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఐఎంఏ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఐడీ నంబరు వస్తుందని, ఆ నంబరు ద్వారా రిజి స్టర్‌ పోస్టు, స్పీడ్‌ పోస్ట్‌ తదితర తపాలా సేవలను ఇంటి నుంచే పొందవచ్చన్నారు. పోస్టు చేయదల చిన పార్సిల్‌ అంచనా బరువు, సమీప పోస్టాఫీసు వివరాలను ఐఎంఏ యాప్‌లో నమోదుచేస్తే సంబం ధిత ప్రాంత పోస్ట్‌మ్యాన్‌ ఇంటి వద్దకు వచ్చి తీసు కెళతారని వివరించారు. పార్సిల్‌ చేస్తున్నవాటికి కనీస పోస్టల్‌ చార్జీలు రూ.500 కాగా పికప్‌ ఉచితం అన్నారు. అంతకంటే తక్కువైతే కనీస పికప్‌ చార్జీ వసూలు చేస్తారని తెలిపారు. చార్జీలను వినియో గదారులు నగదు, యూపీఐ చెల్లింపులు చేయవచ్చ న్నారు. ఐఎంఏ యాప్‌ద్వారా ఏ సమయంలోనైనా పార్సిల్‌ బుక్‌ చేసుకోవచ్చునని, పికప్‌ మాత్రం సమీప పోస్టాఫీసు పనివేళల్లో ఉంటుందన్నారు.

ఈ యాప్‌ నుంచే ఖాతాదారులు తపాలా సుకన్య సమృద్ధి యోజన, కిసాన్‌ వికాస పత్రాలు, తదితర పొదుపు పథకాల్లో డిపాజిట్‌ చేసేందుకు కూడా వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు. భవిష్యత్‌లో ఆదివారం, సెలవు దినాల్లో కూడా త పాలా సేవలందించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలన లో ఉందన్నారు. ప్రైవేటురంగంలో ఇ–కామర్స్‌ సంస్థల ద్వారా వస్తోన్న వ్యాపార పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు వన్‌ సిటీ – వన్‌ డెలివరీ విధానం లో వివిధ ప్రాంతాల నుంచి డెలివరీ నిమిత్తం వచ్చే ఉత్తరాలు, కవర్లను, పార్సిళ్లకోసం ఏలూరు లోని 33 పోస్టాఫీసులను అనుసంధానం చేసి ఒకే పాయింట్‌ ద్వారా అదేరోజు బట్వాడా చేస్తున్నామని వివరించారు. జిల్లావ్యాప్తంగా తపాలాశాఖకువున్న సొంత స్థలాల్లోనే కొత్త పోస్టాఫీసు భవన నిర్మా ణాలను చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, కొద్దిరోజుల్లో ధర్మాజీగూడెంలో తపాలా కార్యాలయ భవననిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు శ్రీకర్‌బాబు ప్రకటించారు. పోస్టల్‌ ఏఎస్పీ డి.శ్రీని వాసరావు, ఐపీపీబీ మేనేజర్‌ రాజేశ్‌, హెడ్‌ పోస్ట్‌మాస్టర్‌ డి.రంగారావు, ఇన్‌స్పెక్టర్లు డి.శ్రీకాంత్‌, యు.చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:53 PM