137
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:38 PM
జిల్లాల పునర్విభజన తర్వాత అక్కడ క్కడ పోలింగ్ కేంద్రాల విషయంలో లోపాలు తలెత్తడంతో పాటు, గతంలో వినియోగంలో ఉన్న కేంద్రాల్లో సౌకర్యా లు లేనివాటి విషయంలో తాజాగా మార్పులు, చేర్పులకు ఇటీవల జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.
జిల్లాలో పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య
1,200 మంది ఓటర్లు వుంటే అదనంగా ఏర్పాటు
1,744 నుంచి 1,881కు పెరిగిన కేంద్రాలు.. త్వరలో ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాల పునర్విభజన తర్వాత అక్కడ క్కడ పోలింగ్ కేంద్రాల విషయంలో లోపాలు తలెత్తడంతో పాటు, గతంలో వినియోగంలో ఉన్న కేంద్రాల్లో సౌకర్యా లు లేనివాటి విషయంలో తాజాగా మార్పులు, చేర్పులకు ఇటీవల జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఆధ్వర్యం లో కలెక్టర్, డీఆర్వో, ఇతర అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం వారీగా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా రేషనలైజేషన్ చేశారు. 1200 మంది ఓట ర్లున్న కేంద్రం వద్ద అదనంగా మరో కేంద్రా న్ని ఏర్పాటుకు సిఫార్సు చేశారు. బడులు, వివిధ సంస్థల కార్యాలయాల్లో ఉన్న వాటిని మౌలిక వసతులుండేలా మార్పులు చేర్పుల కు అవకాశం కల్పించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1,744 పోలింగ్ కేంద్రాలుండగా, మార్పులు, చేర్పులతో వాటి సంఖ్య 1881కు పెంపు జరగనుంది. ఓవరాల్‌గా మొత్తం 137 పోలింగ్ కే ంద్రాలు జిల్లాలో పెరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఒక్కరు
తమ ఓటును సద్వినియోగం చేసుకునే దిశగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఏటా ఓటర్ల జాబితా సవ రణలను పారదర్శకంగా చేపడుతోంది. నిరం తరం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏడాది పొడవునా ఓటరు చేర్పులు, మార్పులకు శ్రీకా రం చుట్టింది. ప్రస్తుతం ఉన్న చోట్ల నుంచి మరొక చోటికి ఉంగుటూరులో 3, దెందులూ రు, ఏలూరులో ఒక్కొక్క కేంద్రం, పోలవరం లో 2, చింతలపూడిలో 5, నూజివీడులో ఏడేసి కేంద్రాల చొప్పున మార్పులను చేపట్టారు. వీటిపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి తుది నిర్ణయం తీసుకోవడంతో యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. త్వరలో అధికారంగా పెరిగిన పోలింగ్ కేంద్రాల ప్రకటన జాబితా వెలుడనుంది.
ఏలూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, కొత్త వాటితో కలిపి మొత్తం ఇలా :
............................................................................................................ ..
నియోజకవర్గం(కోడ్) పోలింగ్ కేంద్రాలు కొత్తవి పెంపుతో ఇలా
.......................................................................................................................
ఉంగుటూరు(63) 214 21 235
దెందులూరు(64) 239 09 248
ఏలూరు (65) 213 34 247
పోలవరం (67) 284 41 325
చింతలపూడి(68) 273 18 291
నూజివీడు(70) 286 05 291
కైకలూరు(73) 235 09 244
...................................................................................................
1744 137 1881
........................................................................................................