ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు: ఎస్పీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:29 AM
ఆరోగ్యమే మహాభాగ్యమని పోలీసు అధికారులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ అన్నారు.
ఏలూరు జిల్లా పోలీసు క్రీడలు ప్రారంభం
ఏలూరు క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యమే మహాభాగ్యమని పోలీసు అధికారులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ అన్నారు. జిల్లా పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ప్రారంభిం చారు. ఈసందర్భంగా ఏలూరు, జంగారెడ్డిగూ డెం, పోలవరం, నూజివీడు సబ్‌డివిజన్ల సిబ్బం దితో పాటు ఆర్ముడు రిజర్వుడు విభాగాల నుం చి తరలివచ్చారు. జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ జెండా వందనం చేసి రంగురంగుల బెలూన్లను ఆకాశంలో ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కేపీఎస్ కిషోర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ తన దైనందిక జీవితంలో కనీసం అరగంట సమ యాన్ని వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ల వద్ద వాలీబాల్, టెన్నీస్ కోర్టులు ఉండేవని అక్కడ ప్రజలతో కలిసి ఆడడం ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని గుర్తు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ ముని రాజా, విజిలెన్సు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు డి శ్రావణ్‌కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు.