జిల్లాలో పోలీస్ పికెట్లు
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:03 AM
తుఫాను ప్రభావంతో ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలను, కలిదిండి మండలంలో ప్రాంతాలను ఎస్పీ కేపీఎస్. కిశోర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ఏలూరు డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు
ఒక ఎస్‌ఐ, 15 మంది సిబ్బందితో ఫోర్స్
చేపల చెరువుపై ప్రమాదం జరిగితే యజమానులే బాధ్యులు
హోర్డింగులు వల్ల ప్రమాదం జరిగితే యజమానిపై చర్యలు
ఏలూరు క్రైం/కైకలూరు/నూజివీడు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావంతో ప్రజలకు ఇబ్బం దులు కలగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలను, కలిదిండి మండలంలో ప్రాంతాలను ఎస్పీ కేపీఎస్. కిశోర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పెదపాడు, కైకలూరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టా లని చేపల చెరువులు, రొయ్యల చెరువుల యజమా నులు చెరువుల వద్ద షెడ్ల వద్ద నివాసం ఉంటున్న వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని సూచించారు. ఎక్కడైనా చేపల చెరువు వద్ద ఏదైనా ప్రమాదం సంభవిస్తే సంబంధిత చేపల చెరువు యజ మానిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిం చారు. హోర్డింగుల వల్ల ప్రమాదం జరిగితే యజమా నులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తుగా ఏలూరు డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్ (ఈడీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. వాగులు, వంకలు, కాలువలు ఉన్న మా ర్గాల్లో ప్రమాదకరంగా ఉన్న వాటి వద్ద పోలీస్ పికెట్ల ను ఏర్పాటు చేశారు. పోలవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, జంగా రెడ్డిగూ డెం డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కైకలూరు పోలీసుస్టేషన్ వద్ద ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు ఎస్పీ కేపీఎస్ కిశోర్ పలు సూచనలు ఇచ్చారు. 70–80కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెరువు గట్లుపై రేకులషెడ్లు ఎగిరిపోయే ప్రమాదం ఉందని, కూలీలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాలను ఎస్పీ కిశోర్, సబ్ కలెక్టర్ వినూత్న సోమవారం పరిశీలిం చారు. పెద్దచెరువు, మొగలి చెరువు తదితర ప్రాంతాల ను పరిశీలించి వరదలు వస్తే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సూచనలు చేశారు. తుఫాను ప్రభావానికి గురయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. డీఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో తుఫాన్ సహాయ పునరావాస కేంద్రాలు
ఏలూరు అర్బన్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస కేం ద్రాల ఏర్పాటుకు హెచ్‌ఎంలు అందుబాటులో ఉండా లని విద్యాశాఖ ప్రత్యేకాధికారి కృష్ణారెడ్డి ఆదేశించారు. డీఈవో కార్యాలయం నుంచి అన్ని మండలాల ఎంఈ వోలతో సోమవారం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో పలు సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల ఏర్పా టుకు రెవెన్యూ అధికారులు గుర్తించిన ప్రభుత్వ ఉన్న త పాఠశాలలను ఇవ్వాలన్నారు. వర్షాలకు ఐఎఫ్‌పి ప్యా నెళ్లు, బియ్యం నిల్వలు, స్కూలు రికార్డులు పాడవ కుండా భద్రపర్చాలని కోరారు. కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్సు ల్యాబ్‌లలో విలువైన పరికరాలు, రసాయనాలను జాగ్రత్తపర్చాలన్నారు. డీఈవో వెంకటలక్ష్మమ్మ, అసిస్టెం ట్ డైరెక్టర్లు అవధాని, వెంకటప్పయ్య, సూపరిం టెండెంట్లు పాల్గొన్నారు.
208 మంది గర్భిణుల తరలింపు
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 పట్టణ ఆరోగ్య కేంద్రా ల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో 82 పునరావాస కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అమృతం, పరిపాలనాధికారి డాక్టర్ గంగాభవాని తెలిపారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మొత్తం 208 మంది గర్భిణులను గుర్తించి, వారినందరినీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల కు తరలించినట్టు అమృతం వివరించారు. గర్భిణుల వైద్య పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు అప్పగించామన్నారు.