Share News

పోలీసు పీజీఆర్‌ఎస్‌లో 17 అర్జీలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:39 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు పోలీసు అధికారులను ఆదేశించారు.

పోలీసు పీజీఆర్‌ఎస్‌లో 17 అర్జీలు
అర్జీలు స్వీకరిస్తున్న అదనపు ఎస్పీ వి.భీమారావు

భీమవరం క్రైం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని, సానుకూలంగా స్పందించారు. కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, భర్త/ అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్‌ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఆస్తి తగాదాలు, ఇతర సమస్యలపై మొత్తం 17 అర్జీలను ఎస్పీ స్వీకరించారు.

Updated Date - Jun 24 , 2025 | 12:39 AM