జంగారెడ్డిగూడెంలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:24 AM
జంగారెడ్డిగూ డెం డీఎస్పీ కార్యాలయంలో ఎస్సీ కేపీఎస్ కిశోర్ సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
జంగారెడ్డిగూడెం/ఏలూరు క్రైం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూ డెం డీఎస్పీ కార్యాలయంలో ఎస్సీ కేపీఎస్ కిశోర్ సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించడం, ఫోన్లు చేసి వ్యాక్సిన్ కోసం ఒకటి నొక్కండి అనే కాల్స్ చేసి మోసం చేసే ముఠాలు బారిన పడవద్దని, తెలియని మెస్సేజ్‌లు కాని లింకులకు కాని స్పందించవద్దని సూచించారు. ఏఐ ఉపయోగించి ఫిర్యాదుల ప్రక్రియను పారదర్శకంగా కాగిత రహితంగా నిర్వహించారు. సైబర్ నేరానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఎస్పీ రవిచంద్ర, సీఐ కృష్ణ బాబు, ఎస్‌ఐ జబీర్ పలువురు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 40 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.