Share News

కొవిడ్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:01 AM

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, ప్రజ లు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త లు తీసుకోవాలని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ సూచించారు.

కొవిడ్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి
సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ కిశోర్‌

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ

ఏలూరు క్రైం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, ప్రజ లు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త లు తీసుకోవాలని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం లో సోమవారం ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ కిశోర్‌, ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు అర్జీలు స్వీకరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ఉపయోగించి ఫిర్యాదుల ప్రక్రి యను పారదర్శకంగా కాగిత రహితంగా నిర్వహించారు. ఫిర్యాదుదారు ఏఐ బోర్డు వద్దకు వెళ్లి వీడియో రికార్డింగ్‌ ద్వారా అర్జీ అందజేశారు. ఎస్పీ కిశోర్‌, ఏఎస్పీ ఎన్‌ సూర్యచంద్రరావు ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు ఆదే శాలు జారీ చేశారు. మొత్తం 40 మంది తమ ఫిర్యాదులను సమర్పించారు.

Updated Date - Jun 10 , 2025 | 01:01 AM