ఏలూరుకు మహర్దశ
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:40 AM
అమరావతి దగ్గరనే ఉన్న ఏలూరు జిల్లా రూపు రేఖలను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. గడిచిన నెల రోజుల్లోనే కీలక నిర్ణయాలు వెలువరింది.
అనువుగా 94.47 ఎకరాల భూ కేటాయింపు
మంత్రి వర్గం తాజా నిర్ణయం
పారిశ్రామికీకరణకు, అంబేడ్కర్ వర్సిటీకి ఇప్పటికే సానుకూలత
నెల రోజుల్లోనే చకాచకా నిర్ణయాలు
అమరావతి దగ్గరనే ఉన్న ఏలూరు జిల్లా రూపు రేఖలను మార్చేందుకు టీడీపీ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. గడిచిన నెల రోజుల్లోనే కీలక నిర్ణయాలు వెలువరింది. ఒక వైపు పారిశ్రామీకరణతోపాటు పోలీసు అకాడమి వంటి కీలక సంస్థలు ఇక్కడికే వచ్చేలా చర్యలు చేపట్టింది.
(ఏలూరు– ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఆగిరిపల్లి మండలం నూగొండపల్లి సమీపంలో 94.47 ఎకరాలను పోలీసు అకాడమికి సమకూర్చేలా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఇప్పటికే ఆగిరిపల్లి మండలంలో ఒక్కొక్కటిగా విధాన నిర్ణయా లు తీసుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఇంతకుముందే గ్రేహౌండ్స్ దళాల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా ఇదే మండలంలో స్థల పరిశీలన చేస్తోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ చొరవ తీసుకున్నారు. ఆయన సతీమణి ధాత్రిరెడ్డి జేసీగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ వ్యవహారాల విషయంలో పోలీసులకు తోడ్పాటు అందుతూనే ఉంది. ప్రభుత్వానికి చెం దిన 94.7 ఎకరాల భూమిని ఉచితం గా పోలీసు అకాడమికి బదలాయి స్తూ రెవెన్యూ యంత్రాంగం ప్రతిపా దనలు సమర్పించింది. వీటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్గం దీనికి అనుగుణంగానే బుధవారం అను మతి ఇచ్చింది. దీంతో ఆగిరిపల్లి మం డలంలో పోలీసు అకాడమి ఏర్పాటు కు మార్గం సుగమం అయ్యింది. దీంతో పాటు రాజధాని అమరావతి చేరువలో ఉండడంతో మరికొన్ని సం స్థలకు భూములు కేటాయించే అవకాశాలు లేకపోలేదు. పెదవేగి మండలం వంగూరు ప్రాంతంలో ఐఏఎస్ అధికారిణి దమయంతి 10.88 ఎకరాలను ఐ ఇనిస్టిట్యూట్‌కు భూమిని విరాళంగా ఇచ్చారు. దీనికి అయ్యే స్టాంపు డ్యూటీని మినహాయించాలని నిర్ణయించారు.
శరవేగంగా నిర్ణయాలు ..
జిల్లాలో గతంలో లేని విధంగా శరపరంపరంగా నిర్ణయాలు వెలువెడుతున్నాయి. ఈ మధ్యనే ఏలూరు సమీపాన అంబేడ్కర్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరు నగర శివారులో వట్లూరు వద్ద ఈ యూ నివర్సిటీకి అనువైన భూమిని సమకూర్చాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో పాటు చింతలపూడి సమీపంలోని పట్టాయిగూడెం వద్ద పారిశ్రామికవాడ స్థాపనకు ఈ మధ్యనే పునాది రాయి వేశారు. ఈ ప్రాంతం లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు నిర్ణ యం తీసుకున్నారు. ఆగిరిపల్లి మం డలం తోటపల్లిలో మంత్రి కొలుసు పార్థసారఽథి చొరవతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీ వల ఆమోదముద్ర వేసింది. రూ.150 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మించబోతున్నా రు. ఈ ప్రాంతంలో సుమారు 1,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.