Share News

చేస్తాం..చూస్తాం..!

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:56 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నష్టపోతున్న నిర్వాసితులకు పరిహారంగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు వారి ఖాతాల్లో జమ చేయగా తాజాగా మరో రూ.1100 కోట్లు ఇటీవల విడుదల చేసింది.

చేస్తాం..చూస్తాం..!
నాగేశ్వరరావు ఇల్లు

అధికారుల నిర్లక్ష్యం.. నిర్వాసితుల పాలిట శాపం

పరిహారం కోసం పాట్లు

ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కానరాని స్పందన

నేడు నిర్వాసితులతో మంత్రి నిమ్మల సమావేశం

సమస్యల పరిష్కారంపై ఆశాభావం

వేలేరుపాడు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నష్టపోతున్న నిర్వాసితులకు పరిహారంగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు వారి ఖాతాల్లో జమ చేయగా తాజాగా మరో రూ.1100 కోట్లు ఇటీవల విడుదల చేసింది. అయితే గతంలో పరిహారం విడు దల చేసిన సమయంలో వివిధ కారణాలతో పలువురికి పరిహారం అందలేదు. నేటికీ అనేక మంది ఏలూరులోని ఎస్‌డీసీ కార్యాల యానికి పది నెలలుగా తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం

కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గృహాల నష్టపరిహారం విషయంలో అనేక తప్పులు దొర్లినా అధికారులు వాటిని సరి చేయడం లేదు. గృహ నష్టపరిహారానికి సం బంధించి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా సర్వే చేయించి పరిహారానికి సంబంధించి జాబితా లు ఎస్‌డీసీ కార్యాలయానికి ఇచ్చారు. పరి హార చెల్లింపుల కోసం బిల్లు పెట్టే విషయం లో నిర్లక్ష్యం ఫలితంగా నిర్వాసితులు లక్ష లాది రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తమకు జరిగిన అన్యాయంపై ఎస్‌డీసీ కార్యాలయానికి వెళ్లి మొర పెట్టు కుంటే ‘చేస్తాం.. చూస్తాం’ అనే మాట తప్ప చేసిందేమి ఉండడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం చెల్లిం పుల కోసం నిధులు విడుదల చేయడంతో బిల్లులు పెట్టే పనిలో అధికారులు నిమగ్నమ య్యారే తప్ప పెండింగులో ఉన్న నిర్వాసితు లకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది.

వేలేరుపాడులో నాగేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఈ గృహానికి ఆర్‌అండ్‌బీ శాఖ సర్వే చేసి 21 లక్షల 36 వేలుగా అంచనా వేసి ఎస్‌డీసీ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు. కార్యాలయ సిబ్బంది బిల్లులు పెట్టే సమయంలో కేవలం 2 లక్షల 18 వేలుగా నమోదు చేయడంతో దాదాపు 19 లక్షలు నిర్వాసితుడు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇదే విధంగా మరో 40 మందికి పరిహారం భారీగా తగ్గింది. పది నెలలుగా కార్యాల యం చుట్టూ తిరుగుతున్నా తమ సిబ్బంది పొరపాటున నమోదు చేశారని సరి చేస్తామని చెబుతున్నారే తప్ప సవరించడం లేదు.

నిర్వాసితులకు నేడు పరిహారం చెక్కులు అందజేత : కలెక్టర్‌

ఏలూరు : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకే జీ పరిహార నిధులు చెక్కులను వేలేరుపాడులో శనివారం జరిగే కార్యక్రమంలో జలవనరులశాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అందజేయనున్నట్టు కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణపై టెలి కాన్ఫరెన్స్‌లో అధికా రులతో కలెక్టరేట్‌ నుంచి ఆమె శుక్రవారం సమీక్షించారు.

Updated Date - Nov 01 , 2025 | 12:56 AM