పోలవరం పరిహారం
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:21 AM
కూటమి ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా న్యాయం చేస్తోంది.
41.15 కాంటూరు లెవెల్‌లో పెండింగ్ క్లియరెన్స్
ప్రాజెక్టు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
కుక్కునూరు/వేలేరుపాడు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా న్యాయం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్‌లో వున్న నిర్వాసితులకు పరి హారం చెల్లింపులో భాగంగా వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం చెల్లిం పులు ప్రారంభమయ్యాయి. వేలేరుపాడులో శని వారం మంత్రి నిమ్మల రామానాయుడు పరిహా రం చెల్లింపు ప్రక్రియ ఆరంభించారు. నిర్వాసితు ల ఖాతాలో పరిహారం జమ అవుతున్నట్లు ఫోన్ మేసేజ్‌లు వస్తున్న క్రమంలో నిర్వాసితుల్లో ఆనం దం వ్యక్తమవుతోంది. అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్ పురం, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలే రుపాడు మండలాల్లోని నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమవుతోంది. కుక్కునూరు మండలం 8 గ్రామాలు, వేలేరుపాడు మండలం 27 గ్రామా లు 41.15 కాంటూరు లెవెల్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో రూ.800 కోట్ల పరిహారం వ్యక్తి గత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం పునరావాస కాలనీలో ఇళ్లు వద్దనుకు న్న వారికి పరిహారం చెల్లించారు. కొందరు నిర్వా సితులకు వివిధ కారణాలతో పరిహారం చెల్లిం పులు పెండింగులో ఉన్నాయి. ఆ కారణాలను అధికారులు గుర్తించి తిరిగి చెల్లింపులు జరిపేలా ప్రక్రియ ఆరంభించారు. ఇంతలోనే ప్రభుత్వం రూ.1000 కోట్ల కోసం విడుదల చేయడంతో ని ర్వాసితులకు చెల్లింపులు ఆరంభమయ్యాయి. అ న్ని అర్హతలున్నా కొందరు నిర్వాసితుల వ్యక్తిగ త పరిహారం, ఇళ్ల పరిహారం పెండింగ్‌లో ఉంది. అవి క్లియర్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు
గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భూములకు పరిహా రం ఇచ్చారు. నిర్వాసితులకు ఈ ఏడాది జనవరిలో, తిరిగి ఇప్పుడు పరిహారం చెల్లిస్తున్నారు. పరిహారం అందడంతో నిర్వాసితు లకు మేలు జరుగుతుంది. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.
– ములిశెట్టి నాగేశ్వరరావు, కుక్కునూరు
మా కష్టాలు తీరినట్లే..
ఏటా గోదావరి వరదలతో ఎన్నో బాధలు పడేవాళ్లం. గోదా వరి వచ్చినప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకుని మరో ప్రాంతానికి వెళ్లి మూడు నెలల పాటు తలదాచుకుని, వరదలు తగ్గిన తర్వాత ఇళ్లకు తిరిగి వచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిగత, ఇళ్ల పరిహారాలు చెల్లి స్తున్నారు. ఇక నిర్వాసితుల బాధలు తొలగినట్లే.
– పిచ్చుకరాజు, ఉపసర్పంచ్, కుక్కునూరు
న్యాయం జరిగింది
నా బ్యాంకు ఖాతాలో ఇంటికి రూ.2.67 లక్షల పరిహారం జమ అయ్యింది. ఈ ఏడాది జనవరిలో వ్యక్తిగత పునరావాస పరిహారం కింద రూ.6.36 లక్షలు చెల్లించారు. ఇప్పుడు నాకు అన్నిరకాల పరిహారం అందడంతో న్యాయం జరిగింది.
– ఊటుకూరి రామకృష్ణ, నిర్వాసితుడు
రూ.3.16 లక్షలు జమ
ఈ రోజు నా ఇంటికి సంబంధించి రూ.3.16 లక్షలు పరిహారం జమ అయినట్టు ఫోన్ మెసేజ్ ద్వారా తెలిసింది. జనవరిలో నాకు రూ.6.36 లక్షలు పరిహారం చెల్లించారు. మా పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– పడాల సత్యవతి, కుక్కునూరు
పరిహారం సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు : మంత్రి నిమ్మల
వేలేరుపాడులో పోలవరం నిర్వాసితులకు చెక్కుల అందజేత
ప్రాజెక్టు నిర్మాణం వల్ల నష్టపోతున్న ప్రతీ ఒక్క నిర్వాసితుడికి పూర్తిస్థాయి పరిహారాలు ఇళ్ల నిర్మాణాలు చేసి అందించి వారిని సంతో షంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానా యుడు పేర్కొన్నారు. పోలవరం భూసేకరణ, పునరావాసం నిర్వాసితుల సభ, పరిహారాల చెక్కులు అందించే కార్యక్రమాన్ని వేలేరు పాడు జూనియర్ కాలేజీ ఆవరణలో శనివా రం జరిగింది. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడారు. ‘కొన్ని కారణాల కారణంగా పరిహారాల చెల్లింపులో అవరోధాలు ఏర్పడితే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్‌సెల్ ఏర్పాటు చేస్తాం. పరిహారం రాని ఏ ఒక్కరు అదైర్యపడవద్దు. రాష్ర్టాభివృద్ధికి ప్రధానిమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమం త్రి పవన్‌కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఆహర్నిశలు పని చేస్తున్నారు. వారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి’ అని కోరారు.
న్యాయం చేసేది కూటమి ప్రభుత్వమే
నిర్వాసితులకు అండగా ఉండి, అన్ని విధాలా న్యాయం చేసేది కూటమి ప్రభుత్వమేనని పోలవ రం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. జగన్ అధికారంలో ఉండి ఐదేళ్లలో చేయలేకపోయిన పనులు కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. మధ్య దళారులకు అవకాశం లేకుండా ఖాతాల కు పరిహారం సొమ్ముల బదిలీ జరుగుతోందని అన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తోందన్నారు. ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులను జగన్ మోసం చేస్తే కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసి పరిహారాలు జమ చేస్తూ నిర్వాసితుల కళ్లల్లో వెలుగులు నింపుతోందన్నారు. రాష్ర్టాభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగకల్పన చేయాలన్నా కూటమి ప్రభుత్వానికే సాధ్యమని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఐదేళ్ల పాలన చేసిన జగన్‌రెడ్డి రాష్ర్టాన్ని సర్వనాశనం చేశాడని జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ విమర్శించారు. పోలవరం కారణంగా తాము నష్టపోతున్నామని తెలిసి రాష్ర్టాభివృద్ధికి త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులు త్యాగధనులని కలెక్టర్ వెట్రిసెల్వి కొనియాడారు. ఏ ఒక్క నిర్వాసితులకు అన్యాయం జరగకుండా ప్రతీ ఒక్కరికి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ ప్రశాంతి, పోలవరం అడ్మినిస్ర్టేటర్ అభిషేక్, జేసీ అభిషేక్‌గౌడ, ఆర్డీవో రమణ, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల టీడీపీ అధ్యక్షులు అమరవరపు అశోక్, ములిశెట్టి నాగు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేశారు. నిర్వాసితులను ఆదుకుంటున్న ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.