జూదాలకు అడ్డాగా !
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:10 AM
నూజివీడు నియోజకవర్గం జూదాలకు అడ్డాగా మారుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నియోజకవర్గంలో ప్రతి మండలంలోను యథేచ్చగా జూదాలు (పేకాట, కోడిపందేలు) జరుగుతున్నాయి.
నూజివీడు నియోజకవర్గంలోని
నాలుగు మండలాల్లోనూ యఽథేచ్ఛగా నిర్వహణ
నూజివీడు నియోజకవర్గం జూదాలకు అడ్డాగా మారుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నియోజకవర్గంలో ప్రతి మండలంలోను యథేచ్చగా జూదాలు (పేకాట, కోడిపందేలు) జరుగుతున్నాయి. నూజివీడు మండలంలో సంకొల్లు తుక్కులూరు, పోతురెడ్డిపల్లి ప్రాంతాల్లో తరచుగా, ఆగిరిపల్లి మండలంలో ఈదర, కనసనపల్లి, తాడేపల్లి, చొప్పరమెట్ల తో పాటు వీలును బట్టి మరికొన్ని గ్రామాల్లో జూదాలు జోరుగా సాగుతున్నాయి. ముసునూరు మండలంలో గుర్రాలమ్మ గట్టు ప్రాంతంలో కోడిపందేలు రాత్రివేళ జరుగు తున్నట్టు అనే ప్రచారంలో ఉంది.
– నూజివీడు – ఆంధ్రజ్యోతి
మైలవరం పోలీసులు దాడి..
నూజివీడు–మైలవరం సరిహద్దులలోని సుంకొల్లు సమీపంలో జూదస్థావరంపై గురువారం సాయంత్రం మైలవరం పోలీసులు దాడి చేశారు. 45 వాహనాలు స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అదుపులోకి తీసు కున్నారు. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసు కుని వీరిని మైలవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మంత్రి సారథి హెచ్చరించినా..
‘నూజివీడు నియోజకవర్గంలో జూదాలు పెరిగాయని నాకున్న సమాచారం. వాటిని అరికట్టకపోతే చర్యలు తప్పవు’ అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పార్థ సారథి పోలీసులను ఇటీవల హెచ్చరించారు. అయినా జూదాలు ఆగలేదు... పోలీసుల దాడులు జరగలేదు. నియోజకవర్గంలో జూదాలపై మంత్రి ఉక్కుపాదం మోపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతు న్నారు.
మ్యాంగో బే తిరిగి ప్రారంభం
ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు గ్రామ పరిధిలో మ్యాంగో బే అనే రిక్రియేషన్ సొసైటీ తిరిగి ప్రారంభ మైంది. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ అనే పేరుతో ఈ రిక్రియేషన్ క్లబ్ 2011లో ప్రారంభ మైంది. అప్పట్లోనే అనేక వివాదాలతో నడిచిన ఈ సొసైటీపై పలు ఆరోపణలు రావడం, పోలీసులు దాడు లు జరగడం, నిబంధనలకు విరుద్ధంగా జూదాలు జరుగు తున్నాయని రుజువు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు జోక్యంతో 2014లో ఈ క్లబ్ మూతపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూతపడే ఉంది. ఇటీవల ఈ సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకి అనుమతి సాధించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో నడుపుతాం..
ఈ సొసైటీలో సభ్యులకే ప్రవేశ మని, ఈ సొసైటీలో 100 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని ఇతరు లకు ప్రవేశం లేదని సొసైటీ నిర్వా హకుడు కాట్రగడ్డ అశోక్ విలేకరు లకు తెలిపారు. గత మూడు రోజుల నుంచి ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన పలువురు యువ కులు ఈ సొసైటీ గేటు వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈసంద ర్భంగా క్లబ్ నిర్వాహకులను సమాచారం కోరగా అశోక్ విలేకరులతో మాట్లాడుతూ 13 ముక్కల ఆటకు కోర్టు అనుమతించింద ని, అది తప్ప మరి ఏ ఇతర జూదాలను ఇక్కడ నిర్వ హించడం జరగదన్నారు. 30 సీసీ కెమెరాల పర్యవేక్షణలో లోపల ఆటల నిర్వహణ జరుగుతుందన్నారు. ఈ కెమెరాలను ఎస్పీ కార్యాలయా నికి ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తామ న్నారు. సభ్యత్వ రుసుము సభ్యుడి నుంచి ఏడాదికి రూ.500 వసూలు చేస్తున్నా మన్నారు. 2014 నుంచి నాటి ప్రభుత్వం సహకారం లేకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ సొసైటీని నిర్వహించలేక మూత వేశామన్నారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సొసైటీ ఆవరణలో బోటింగ్‌తో పాటు ఇండోర్ అవుట్‌డోర్ థియేటర్లు ఉన్నాయన్నారు. వివాహాలు వంటి కార్యక్రమా లకు స్వల్ప రేట్లతో అద్దెకు ఇస్తామన్నారు. కాగా రాజకీయ బలం ఉన్న కొందరు అక్రమార్కులు ఈ సొసైటీలో వాటాల కోసం యత్నాలు జరుపుతున్నట్టు వినిపిస్తోంది. ఈ యత్నాలు ఫలిస్తే జూదరులకు నిత్యం పండుగే. జిల్లా ఎస్పీ ఈ సొసైటీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమా చారం. ఇంతవరకు ఆగిరి పల్లి పోలీస్‌స్టేషన్‌కు కెమెరాలు అనుసంధానం జరగలేదని ఆగిరిపల్లి ఎస్‌ఐ శుభశేఖర్ విలేకరులకు తెలిపారు.