పట్టణాలకు పైప్‌లైన్
ABN , Publish Date - May 19 , 2025 | 12:23 AM
గ్రామాలు, పట్టణాల మురుగుతో పాటు ఆక్వా చెరువుల నుంచి వ్యర్థ నీరు పంట కాలవల్లోనే కలిపేస్తున్నారు. ఫలితంగా తాగునీటి సమస్య తలెత్తింది.
విజ్జేశ్వరం నుంచి నేరుగా శుద్ధిప్లాంట్‌లకు మళ్లింపు
నిధులు కేటాయించిన ప్రభుత్వం
సిద్ధమవుతున్న డీపీఆర్
గ్రామాలు, పట్టణాల మురుగుతో పాటు ఆక్వా చెరువుల నుంచి వ్యర్థ నీరు పంట కాలవల్లోనే కలిపేస్తున్నారు. ఫలితంగా తాగునీటి సమస్య తలెత్తింది. తాగునీటిని వాటర్ ప్లాంట్‌ల నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. ప్రజలు ఏటా తాగునీటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి కూటమి ప్రభుత్వం పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లకు సన్నాహాలు చేసింది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా విజ్జేశ్వరం వద్ద శుద్ధి చేసిన జలాలను పల్లెలకు పైప్‌లైన్‌ల ద్వారా సరఫరా చేయనున్నారు. ఆ దిశగా భూసేకరణ, సర్వేలో సిబ్బంది నిమగ్నమయ్యారు. పట్టణాలకు పైప్‌లైన్‌ల ద్వారా గోదావరి జలాలలను మళ్లించే ప్రాజెక్ట్‌కు తాజాగా శ్రీకారం చుట్టారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రజలకు రక్షిత నీటి అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గోదావరి జలాలను పట్టాణాల్లో నీటి శుద్ధి ప్లాంట్‌లకు మళ్లించనున్నారు. పంపుల చెరువుల్లో భర్తీ చేస్తారు. అక్కడ శుద్ధిచేసి పట్టణ ప్రజలకు నీటిని సరఫరా చేస్తారు. గోదావరి జలా లను మళ్లించే పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను పట్టణాలకు అమ లు చేస్తున్నారు. ఎప్పటిలాగే మునిసిపాలిటీలు నీటిని శుద్ధిచేసి ప్రజలకు సరఫరా చేయనున్నాయి.
ప్రయోజనమిదే..
వేసవిలో పట్టణాల్లో మంచినీటి అవసరాలకు శుద్ధిచేసిన జలాలు సరిపోవడం లేదు. నీటి సరఫరా సమయంలో విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. వేసవిలో ఒంటిపూట సరఫరా చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలను అధిగమించ డానికి పైప్‌లైన్ ప్రాజెక్ట్ ఉపయోగప డనుంది. వేసవిలో గోదావరి జలాలను విజ్జేశ్వరం నుంచి మళ్లించి మున్సిపాలి టీల్లో శుద్ధి చేస్తారు. కాలువ నీటితో ఇక ఇబ్బంది ఉండదు. పైప్‌లైన్‌ల ద్వారా నేరు గా పట్టణాల్లోని పంపుల చెరువుల్లోకి నీటిని మళ్లి స్తారు. దీనివల్ల కాలుష్యం లేని జలాలు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. జిల్లాలోని భీమవరం, తణుకు, పాలకొల్లు, నరసాపురం మున్సిపాలిటీలతో పాటు, ఆకివీడు నగర పంచాయతీకి ప్రభుత్వం నిధులు కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80శాతం నిధులు భరించనున్నాయి. మునిసి పాలిటీలు మిగిలిన 20శాతం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా ప్రజారోగ్య శాఖ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది.
గత ప్రాజె క్ట్ రద్దు
గత తెలుగుదేశం హయాంలో రూ. 225 కోట్లతో పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. అప్పట్లో నిడదవోలు, తణుకు, పాలకొల్లు పట్టణాలకు పైప్‌లైన్ వేయాలి. తర్వాత వైసీపీ పాలనలో ప్రాజెక్ట్ పడకేసింది. కూటమి ప్రభు త్వం కొత్త ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసింది. తూర్పు గోదావ రిలో నిడదవోలు, జిల్లాలోని తణుకు, పాలకొల్లు, నర సాపురం, భీమవరం, ఆకివీడు పట్టణాలకు పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను విస్తరించారు. తాడేపల్లిగూడెంలో రెండో సమ్మర్ స్టోరేజ్ ట్మాంక్ నిర్మిస్తున్నారు. ఇక్కడికి పైప్ లైన్ అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది. భవిష్య త్‌లో అవసరమైతే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి పైప్‌లైన్ వేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
నిధులు రూ. కోట్లలో
భీమవరం 167
పాలకొల్లు 119
తణుకు 108.5
నరసాపురం 125
ఆకివీడు 75