హరహర మహాదేవ
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:49 PM
కార్తీక మాసం ఆఖరి సోమవారం పంచారామ క్షేత్రాలైన గునుపూడిలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
కార్తీకమాసం.. ఆఖరి సోమవారం కిటకిటలాడిన శివాలయాలు
భీమవరం టౌన్/ పాలకొల్లు అర్బన్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం ఆఖరి సోమవారం పంచారామ క్షేత్రాలైన గునుపూడిలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
గునుపూడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. దాదాపు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున ఆలయ అర్చకుడు చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. 7 లక్షల 59 వేల 900 రూపాయిలు ఆదాయంగా వచ్చిందని అధికారులు తెలిపారు. పాలకొల్లులో వివిధ రాష్ట్రాల నుంచి 120 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వందలాది వాహనాల్లో సుమారు 50 వేల మంది వరకూ భక్తులు వచ్చారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రేపాక వారి సత్రంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు 8000 మందికి భోజనాలు ఏర్పాటుచేశారు.