శంభో.. శివ శంభో..
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:35 AM
కార్తీక సోమవారం పంచారామ క్షేత్రమైన గునుపూడిసోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.
భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు..
శివయ్యకు అభిషేకాలు
భీమవరం టౌన్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కార్తీక సోమవారం పంచారామ క్షేత్రమైన గునుపూడిసోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రానికి దాదాపు 20వేల మంది దర్శించుకుని ఉంటారని అంచనా. టికెట్లు, ప్రసాదం అమ్మకాల ద్వారా రూ.2,99,900 ఆదాయం వచ్చినట్లు ఈవో రామకృష్ణంరాజు తెలిపారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ చైర్మన్ చింతలపాటి బంగ్రారాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు.
కిటకిటలాడిన క్షీరారామం
పాలకొల్లు అర్బన్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వరస్వామి ఆల యం సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి భక్తుల ఓం నమశివాయ ఘోషతో ఆలయం మార్మోగింది. ఆలయ సమీపం లోని రేపాక వారి సత్రంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సుమారు 8 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాల నుంచి పంచారామ క్షేత్రాల పేరుతో ఆర్టీసీ, ప్రెవేటు బస్సులు సుమారు 120 వరకూ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అలాగే సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకు న్నట్టు ఆలయ వర్గాల సమాచారం. స్వామివారికి ప్ర త్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్యక్ర మాల్లో ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, చైర్మన్ మీసా ల రాము, ట్రస్టీలు, దేవదాయశాఖ ఈవోలు, సిబ్బం ది, వలంటీర్లు పాల్గొన్నారు. పట్టణంలో పంచారామ క్షేత్రాల వాహనాలతో రద్దీగా మారింది. పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పట్టిసీమ శివక్షేత్రానికి భక్తుల తాకిడి
పోలవరం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం తుఫాన్ ప్రభావంతో లాంచీలు నిలిపి వేయడంతో ఆలయానికి భక్తులు రాలేకపోయారు. రెండో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో రద్దీ పెరిగింది. ఆలయంలో స్వామి వారికి భస్మాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ ఈవో సీహెచ్ వెంకట లక్ష్మి భక్తులకు అల్పాహారం, అన్నదానం, భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు సీఐ బాల సురేష్‌బాబు, ఎస్‌ఐ పవన్‌కుమార్ పట్టిసీమ ఫెర్రీ రేవు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
ద్వారకాతిరుమలలో రద్దీ
ద్వారకాతిరుమల, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న భ్రమరాంబ మల్లి కార్జునస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గర్భాలయంలో శివదేవుని లింగ స్వరూపానికి అర్చకులు అర్చన, అభిషేకాది కార్యక్రమాలు జరిపారు. ఆ తరువాత హారతులను ఇచ్చారు.
ఆచంటేశ్వరుడికి అభిషేకాలు
ఆచంట, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం రెండో సోమవారం మండలంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. వేకువజామున భక్తులు గోదావరి, కాలువ, చెరువుల్లో కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఆచంటేశ్వరుని ఆలయం వేకువజామునుంచి సాయంత్రం వరకు భక్తుల పూజలు, అభిషేకాలతో కిటకిటలాడింది. స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ ఈవో ఆదిమూలం వెంకట సత్యనారాయణ, చైర్మన్ నెక్కటి గజేశ్వరరావు, కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.