కిటకిటలాడిన చిన్న తిరుపతి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:57 PM
చిన్న వెంకన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
ద్వారకాతిరుమల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): చిన్న వెంకన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి ఆలయానికి యాత్రికుల రద్దీ నెలకొంది. దేవ స్థానంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడా యి. కొండపై పార్కింగ్ ప్రాంతం కార్లు, ద్విచక్ర వాహ నాలతో నిండింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 2గంటల పైబడి సమయం పట్టింది. సుమారు 12 వేల మంది వచ్చినట్లు అధికారుల అంచనా. సాయంత్రం నుంచి రద్దీ తగ్గుముఖం పట్టింది. శ్రీవారి నిత్యార్జిత కల్యాణం లో దాదాపు 125 జంటలు పాల్గొన్నారు.
మద్దిలో సువర్చల హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం రూరల్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం పురస్కరించుకుని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తు న్నారు. ఆదివారం ఉదయం హనుమద్ హోమం అనంతరం సువర్చల హనుమద్ కల్యాణం వైభవంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని ఆలయ 108 ప్రదక్షిణలు, తలనీలాలు, అన్నప్రాసనలతో మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వివిధ సేవల రూపంలో రూ.2.42 లక్షల ఆదాయం వచ్చిందని, నిత్యాన్నదాన సత్రంలో సుమారు 3600 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్టు ఈవో ఆర్‌వి చందన తెలిపారు.
గుబ్బల మంగమ్మను దర్శించుకున్న భక్తులు
బుట్టాయగూడెం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పశ్చి మ ఏజెన్సీలో కొలువైన గుబ్బల మంగమ్మను ఆదివా రం భక్తులు దర్శించుకున్నారు. తుఫాను కారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు హెచ్చరి కలతో నాలుగు రోజులపాటు ఆలయ మార్గం మూసి వేశారు. వాతావరణం అనుకూలించడంతో మార్గం తెరవడంతో ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బం దులు కలుగకుండా కమిటీవారు ఏర్పాట్లు చేశారు.
క్షీరారామంలో చిలుకు ద్వాదశి పూజలు
పాలకొల్లు అర్బన్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. పంచారామ క్షేత్రమైన క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పంచా రామ క్షేత్రాల దర్శనం పేరుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆర్టీసీ, వివిధ వాహనాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీలక్ష్మీ జనార్దనస్వామికి ప్రత్యేక పూజలు చేసి అలకంరణలు చేశారు. సుమారు 12వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా.
ఆచంటేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ఆచంట, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం పురస్కరించుకుని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆచంటేశ్వరుడికి ఆదివారం లక్షపత్రి పూజ పార్వతి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.
సోమేశ్వరుడికి ప్రత్యేక అలంకారం
భీమవరం టౌన్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గునుపూడి సోమేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకుడు రామకృష్ణ అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈవో డి.రామకృష్ణంరాజు, చైర్మన్ చింతలపాటి బంగార్రాజు పర్యవేక్షించారు.