గోవిందా.. గోవిందా..
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:06 AM
గోవింద నామ స్మరణతో చిన్న తిరుపతి హోరెత్తింది. వేలాది మంది భక్తులు శనివారం ద్వారకాతిరుమలకు తరలివచ్చారు.
ద్వారకాతిరుమలలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల, మే 31(ఆంధ్రజ్యోతి): గోవింద నామ స్మరణతో చిన్న తిరుపతి హోరెత్తింది. వేలాది మంది భక్తులు శనివారం ద్వారకాతిరుమలకు తరలివచ్చారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో దాదాపు 20 వేలకు పైబడి యాత్రికులు క్షేత్రానికి చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకు న్నారు. తెల్లవారుఝామునుంచే ఆలయానికి యాత్రికుల రాక ప్రారంభమైంది. ఆలయం లోని అన్ని విభాగాలు భక్తులతో సందడిగా మారాయి. శేషాచలం ఘాట్‌రోడ్లు వాహనాల తో కిటకిటలాడాయి. శ్రీవారి ఉచిత దర్శనా నికి 3 గంటల పైబడి సమయం పట్టింది. మద్యాహ్నం 3గంటల నుంచి యాత్రికుల రద్దీ కాస్త తగ్గింది. దర్శనానంతరం భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
వెండి చెంబుల బహూకరణ
కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన ముసు నూరు బాల మన్మధరావు శంఖు, చక్ర, నామాలతో ఉన్న పది వెండి చెంబులను స్వామివారి సేవలకు వినియోగించాలని ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తికి అందజేశారు. వీటి విలువ షుమారు రూ.1.70 లక్షలు ఉండవచ్చని అంచనా.