శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలకు కసరత్తు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:35 AM
శాశ్వత ప్రాతిపదికన కుల ధ్రువీకరణ పత్రాలు అందిం చేందుకు కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటున్నది.
తాడేపల్లిగూడెం రూరల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): శాశ్వత ప్రాతిపదికన కుల ధ్రువీకరణ పత్రాలు అందిం చేందుకు కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. విద్య, ఉద్యోగం, పథకాలు అన్నింటికి ఈ ధ్రువీకరణ పత్రాలు అత్యవసరం. రెవెన్యూ అధికారులు ఒకసారి ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తే దాని కాలపరిమితి ఐదేళ్లు. ఈ కారణంగా అవసరమైన ప్రతిసారి ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు దరఖా స్తు చేసుకోవడం ప్రహసనంగా మారింది. ఈ క్రమం లో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డేటాబేస్ జా బితా ఆధారంగా సుమోటాగా తీసుకుని మండలాల వారీగా కుల ధ్రువీకరణకు అధికారులు ఏర్పాటు చేస్తు న్నారు. గ్రామాల వారీగా వీఆర్‌వోల లాగిన్‌లో వారి వ్యక్తిగత వివరాలు తెలిసే విధంగా కుల ధ్రువీకరణ కూడా జత చేసేందుకు కసరత్తు చేస్తోంది. మండలం లో గ్రామాల వారీగా కుల ధ్రువీకరణ నమోదు చేసి తహసీల్దార్ లాగిన్‌లో వాటి వివరాలు నమోదు ద్వారా అవసరమైన సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ (ఏఐ) ఆధారంగా సులభపద్ధతిలో కుల ధ్రువీకరణ పత్రాలు జారీకి వీలు వుంటుందని ప్రభుత్వం యోచి స్తోంది. ఈ తరహా జిల్లాలో రెండు లక్షల మందికి పత్రాలు అందించాలని అంచనా వేస్తున్నారు.
ఒక వ్యక్తి, అతని కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు నమోదు చేయడం ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఈ కుల ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. డేటా బేస్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా లబ్ధిదారులు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆన్‌లైన్ విధానంలో వారికి ధ్రువపత్రాలు జారీ చేసే వీలుం డేలా ఈ తరహా డేటా నమోదుకు అవకాశం లభించ నుంది.
శాశ్వత పత్రాలు అందిస్తాం
లబ్ధిదారులు ఎప్పటికప్పుడు కుల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆదరా బాదరాగా వాటిని మంజూరు చేయడం కాకుండా ఒకేసారి శాశ్వత ప్రాతిపదికన కుల ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రతీ గ్రామంలో వీఆర్‌వో లాగిన్‌లో వాటిని నమోదు చేయడం ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఈ పత్రాలు అందించనున్నాం.
– వెంకటేశ్వరరావు, డీఆర్‌వో