93.87 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:38 AM
జిల్లాలో అక్టోబరు నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం పంపిణీ చేశారు.
ఏలూరు సిటీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి):జిల్లాలో అక్టోబరు నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం పంపిణీ చేశారు. ఉదయం 7 గంటలకు జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో 5,175 మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. జిల్లాలో 2,60,765 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు 2,44,787 మందికి (93.87 శాతం) పంపిణీ చేసినట్టు డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు తెలిపారు. నూజివీడు నియోజక వర్గం ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి, సబ్ కలెక్టర్ వినూత్న పింఛన్లను పంపిణీ చేశారు.