Share News

దివ్యాంగులందరికీ పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:23 AM

నోటీసులు అందుకున్న దివ్యాంగులలో అర్హుల మంటూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ సెప్టెంబరు నెల పింఛన్లను సోమవారం పంపిణీ చేశారు.

దివ్యాంగులందరికీ పింఛన్ల పంపిణీ
ఆకివీడులో వృద్ధురాలికి పింఛన్‌ పంపిణీ చేస్తున్న రఘురామ

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): నోటీసులు అందుకున్న దివ్యాంగులలో అర్హుల మంటూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ సెప్టెంబరు నెల పింఛన్లను సోమవారం పంపిణీ చేశారు. నోటీసులు అందుకున్న దివ్యాంగులకు మరోసారి సదరం సర్టిఫికెట్లు తెచ్చుకునే అవకాశం కల్పించారు. వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిని మరోసారి పరిశీలన చేయనున్నారు. బెడ్‌రీడన్‌ పెన్షన్‌లు కూడా యధావిధిగా అందించారు. వచ్చే నెల పెన్షన్ల పంపిణీ సమయానికి అనర్హులను తొలగించే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సోమవారం పెన్షన్‌ల పంపిణీలో కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు అందించారు. కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పంపిణీలో పాల్గొన్నారు. జిల్లాలో 2,26,513 మందికి పెన్షన్‌లు మంజూరు కాగా సోమవారం సాయంత్రానికి 2,05,901 మందికి పెన్షన్‌లు అందించారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డులు 66.88% పంపిణీ

జిల్లాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ 66.88 శాతం పూర్తయ్యింది. గత నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేపట్టారు. మొత్తం 55 లక్షల 13 వేల 32 కార్డులు రాగా ఇప్పటి వర కు మూడు లక్షల 68 వేల 762 కార్డులను సచివాలయాల ద్వారా అందజేశారు. సోమ వారం నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా ఇస్తారు. రేషన్‌కు వెళ్లేవారు వీటి ని తీసుకోవచ్చు. సోమవారం సాయంత్రానికి కార్డుల పంపిణీలో వీరవాసరం మండలం మొదటి స్థానంలో వుంది.

Updated Date - Sep 02 , 2025 | 12:23 AM