Share News

గోకులం డబ్బులొచ్చాయి..

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:36 AM

జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు ప్రభుత్వం రూ.9.73 కోట్లు విడుదల చేసింది.

గోకులం డబ్బులొచ్చాయి..

రూ.9.73 కోట్లు విడుదల

2014–19 బిల్లుల మంజూరు

పాడి రైతుల్లో జోష్‌

కాంట్రాకర్లకు ఊరట

కాంట్రాక్టర్లు మా పార్టీ వారు కాదు.. మా ప్రభుత్వంలో పనులు చేయలేదు.. బకాయిలు చెల్లిస్తే ప్రత్యర్థి పార్టీ శ్రేణులు బలోపేతం అవుతాయి. బకాయిల చెల్లింపు విషయమై గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకమిది.

పార్టీలతో సంబంధం లేదు. ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పనులు నిర్వహిస్తే బిల్లులు చెల్లించాలి. ముందుగా పెండింగ్‌ బిల్లులను క్లియన్‌ చేయాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ఇదీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ భావన.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు ప్రభుత్వం రూ.9.73 కోట్లు విడుదల చేసింది. గతంలో పెండింగ్‌ బిల్లులు చెల్లించనున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. కొందరు కాంట్రా క్టర్లు న్యాయస్థానాలను ఆశ్రయించి సొమ్ము తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఉపాధి పథకంలో చేపట్టిన అభివృద్ధి పనుల కు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

2014–19 మధ్య చేపట్టిన పనులకు సంబంధించి బకా యిలు మిగిలే ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో చేసిన పనులంటూ వైసీపీ ప్రభుత్వం చెల్లింపులను నిర్లక్ష్యం చేసింది. ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొన్ని పెండింగ్‌ బిల్లులను విడుదల చేసింది. గడచిన ఐదేళ్లలో చేసిన పనులకు బిల్లులు చెల్లించారు. ఐదేళ్లకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులకు మోక్షం లభించలేదు. తాజాగా వీటి చెల్లింపులకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దాంతో కాంట్రాక్టర్లు, తెలుగుదేశం శ్రేణులకు కాస్త ఊరట లభించిం ది. ఏడేళ్ల క్రితం నిర్మించిన గోకులాల బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసింది. పాడి రైతు నెత్తిన పాలు పోసింది. ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్న ఉద్దేశంతో అప్పట్లో రైతులు గోకులాలు నిర్మించుకున్నారు. కానీ ప్రభుత్వం మారిపోవ డంతో వైసీపీ బిల్లులను పక్కన పెట్టేసింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయితీ తో గోకులాల నిర్మాణాన్ని చేపట్టింది. జిల్లాలో 770 గోకులాల ను మంజూరు చేయగా 550 పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. గోకులాలకు సంబంధించి మూడు విడతల్లో ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. పాడి పశువులకు సంబంధించి రెండు ఆవులు ఉన్నా, లేదా ఆవు దూడ ఉన్నా ప్రభుత్వం రూ.1.15 లక్షలు ఇస్తుంది. అందులో రూ.1.03 లక్షలు రాయితీ కల్పిస్తోంది. నాలుగు పాడి పశువులకు రూ.1.80 లక్షలు, పాడి సంపద ఆరు ఉంటే రూ.2.30 లక్షలు గోకులానికి ఇస్తున్నారు. దీనిలో 90శాతం ప్రభుత్వ రాయితీ కాగా 10శాతం రైతుల పెట్టుబడి. గోకులాలకు చెందిన బకాయిల్లో తొలి విడత సొమ్ములు మంజూరు చేశారు.

బకాయిలు మంజూరు ఇలా..

ప్రభుత్వం 2014–19 కాలంలో చేసిన పనులకు 2.96 కోట్లు విడుదల చేసింది. అందులో అభివృద్ధి పనులు అంటే సీసీ రహదారులు, డ్రెయిన్లకు రూ.2.23 కోట్లు మంజూరు చేసింది. మరో రూ.73 లక్షలు గోకులాల బకాయి చెల్లించిం ది. 2024–25లో జిల్లా వ్యాప్తంగా నిర్మించిన గోకులాలకు రూ.15 కోట్లు విడుదల చేయాలి. తొలి విడత రూ.4.75 కోట్లు విడుదల చేసి పాడి రైతుల్లో జోష్‌ నింపింది. ఇప్పటి దాకా రైతులు గోకులాల బకాయిల కోసం ఎదురుచూశారు. మొత్తంపైన ప్రభుత్వం ఒకేసారి రూ. 9.71 కోట్లు విడుదల చేసి రైతులు, కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చింది.

Updated Date - Jun 20 , 2025 | 12:36 AM