ఘనంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:46 AM
జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల, అభిమాన సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఉత్సాహంగా గడిపారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల, అభిమాన సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఉత్సాహంగా గడిపారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
తాడేపల్లిగూడెం/తాడేపల్లిగూడెం అర్బన్/తాడేపల్లిగూడూ రూరల్/ పెంటపాడు: నేటి రాజకీయాలకు స్ఫూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలుస్తారని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే సహకారంతో బాలింతలకు బేబీ కిట్లను అందజేశారు. 15వ వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న రెడ్డి జగన్నాధం అనే వ్యక్తికి రూ.40వేలు ఆర్థిక సాయం ఎమ్మెల్యే చేతులు మీదుగా అందజేశారు. బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన పది తోపుడు బండ్లను పేద వ్యాపారులకు అందజేశారు. జువ్వలపాలెంలోని శ్రీదేవి పుంత వద్ద కామిరెడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. మొక్కలు పంపిణీ, జనసేన టీషర్టులు పంపిణీ చేశారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో భవన, కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి పాల్గొన్నారు. పెంటపాడు మండలం పడమరవిప్పర్రు గ్రామంలో జన సైనికుల ఆధ్వర్యంలో సుమారు వందమందికి గుండెకు సంబంధిం చిన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అపరేషన్ నిమిత్తం రిఫర్ చేశారు. తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరం పీహెచ్‌సీలో కూటమి నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, కూటమి నాయకులు, పీహెచ్‌సీ వైద్యులు పాల్గొన్నారు.
తణుకు/తణుకురూరల్/అత్తిలి/ఇరగవరం, సెప్టెంబరు 2(ఆంధ్ర జ్యోతి) : తణుకు టీడీపీ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం వేంకటేశ్వర సెంటర్, సజ్జాపురంలలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌లను కట్ చేసి, భారీ అన్నదానం నిర్వహించారు. తణుకు రూరల్ మండలం దువ్వ, పైడిపర్రు, తేతలి గ్రామాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అత్తిలి మండలం అత్తిలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిభిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి, కేక్‌ను కట్ చేశారు. ఇరగవరం మండలం ఇరగవరం, అర్జునుడుపాలెం, కొత్తపాడు, తూర్పువిప్పర్రు, కత్తవపాడు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని కేక్‌కట్ చేశారు.
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు లయన్స్ క్లబ్ భవనంలో వలంటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని పట్టణ సీఐ కోలా రజనీకుమార్ ప్రారంభించారు. అభిమాన సంఘ నాయకుడు తులా రామలింగేశ ్వరరావు, శిడగం సురేంద్ర, విన్నకోట గోపి, ప్రేమ్ కుమార్, పి.శ్రీనివాస్, దినేష్, బి.లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అనంంతరం అభిమానులు జనసేన పార్టీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెదమామిడిపల్లిలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. వృద్ధ మహిళకు 25కిలోల బియ్యం, దుస్తులు, అందించారు. చేబ్రొలు కృష్ణ మోహన్, పరిమి సాయి, జీఎస్‌మూర్తి, పెద్దిరాజు, రాజేష్, శేషు, మణికంట నాయుడు, తద తరులు పాల్గొన్నారు.
ఆకివీడు/కాళ్ల/ఉండి : ఆకివీడు జనసేన కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పిల్లా బాబులు నేతృత్వంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు తనయుడు భరత్ కేక్ కట్‌చేసి, రక్తదాన శిబిరాన్ని సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. 154 మంది రక్తదానం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జుత్తిగ నాగరాజు, మండలాధ్యక్షుడు బాలాజీ, సహకార బ్యాంకు చైర్మన్ ముత్యాల రత్నం, టీడీపీ యువనేత మోటుపల్లి సాయిఅరవింద్, బీజేపీ మండలాధ్య క్షురాలు ఎంఎన్వీ నాగమణి తదితరులు ఉన్నారు. ఆకివీడు టీడీపీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు మోటుపల్లి రామవర ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కాళ్ల మండలం కాళ్ల సాయిబాబా ఆలయంలో పవన్ పేరిట పూజలు నిర్వహించి అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో సుమారు వంద మంది యువకులు రక్తదానం చేశారు. కాళ్ల సొసైటీ అధ్యక్షుడు, జనసేన మండలాధ్యక్షుడు ఏరుబండి రామాంజనేయులు, ఆరేటి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఉండి మార్కెట్ యార్డులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భారీ కేక్‌ను కట్ చేసి కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మకు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన ఇన్‌చార్జి జుత్తుగ నాగరాజులకు తినిపించారు.
ఆచంట/పెనుగొండ : ఆచంట కచేరి సెంటర్‌లో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పవన్‌కు శు భాకాంక్షలు తెలిపారు. స్థానిక రామేశ్వరస్వామి సత్రంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన మండల అధ్యక్షుడు జవ్వాది బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ మండలం చెరుకువాడ శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో సొసైటీ చైర్మన్ నక్కా వేద వ్యాస శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెనుగొండ గాంధీ బొమ్మల సెంటర్ అభయాంజనేయస్వామి గుడి వద్ద పూజలు నిర్వహించారు. పెనుగొండ గూంగూరతూమ్ సెంటర్‌లో లక్ష్మి టీస్టాల్ షాపు యజమాని ఉచితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ అందజేశారు.