Share News

వాటర్‌ గ్రిడ్‌ పథకానికి పవన్‌ శంకుస్థాపన !

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:39 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కు స్వచ్ఛ జలాలను అందించే జలజీవన్‌ మిషన్‌ వాటర్‌ గ్రిడ్‌ పథకానికి ఈ నెల మూడో వారంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేయను న్నారు.

వాటర్‌ గ్రిడ్‌ పథకానికి పవన్‌ శంకుస్థాపన !
విజ్జేశ్వరం నుంచి వేసే పైపులైన్‌ మ్యాప్‌ను మంత్రి దుర్గేశ్‌కు వివరిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాస్‌

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌

పెరవలి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కు స్వచ్ఛ జలాలను అందించే జలజీవన్‌ మిషన్‌ వాటర్‌ గ్రిడ్‌ పథకానికి ఈ నెల మూడో వారంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేయను న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కింద రూ.1400 కోట్లు మంజూరు చేశాయి. విజ్జేశ్వరం బ్యారేజ్‌ నుంచి గోదావరి నీటిని శుద్ధి చేసి పైపులైన్‌ల ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తా రు. పెరవలిలో భారీ భూగర్భ మంచినీటి ట్యాంక్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాం తాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమలోని 854 గ్రామాలకు ఈ పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. విజ్జేశ్వ రం, పెరవలిలలో పనులకు పవన్‌ శంకుస్థాపన చేస్తారని, అనంతరం ఇక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. పెరవలి, కానూ రు, నిడదవోలు, వేలివెన్నులలో భూగర్భ మంచినీటి ట్యాంక్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌డీఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఐదు లక్షల లీటర్లు పట్టే విధంగా 30 సెంట్ల స్థలంలో ట్యాంకు నిర్మిస్తామన్నారు. ఏఈ బాలమురళీకృష్ణ, పిప్పర రవి, అతికాల శ్రీను, సలాది కృష్ణమూర్తి, బొడ్డు రామాంజనేయులు, తహసీల్దార్‌ నిరంజన్‌, ఎంపీడీవో ఉమా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:39 AM