రాజముద్రతో పట్టాదార్ పుస్తకాలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:56 AM
రైతుల పొలాలకు సంబంఽధించిన ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదార్ పుస్తకాల పంపి ణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందుకు జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు వారంపాటు ఊరూరా రెవెన్యూ గ్రామసభలు నిర్వహించనుంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
రైతుల పొలాలకు సంబంఽధించిన ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదార్ పుస్తకాల పంపి ణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందుకు జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు వారంపాటు ఊరూరా రెవెన్యూ గ్రామసభలు నిర్వహించనుంది. 2023లో వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో ముద్రించిన పట్టాదార్ పుస్తకాలను పంపిణీ చేసింది. దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తమ ఆస్తి పత్రా లపై జగన్ బొమ్మ ఉండటం ఏమిటంటూ వ్యతిరే కించారు. ఇది ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణమైంది. తర్వాత అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొద్ది నెలలు క్రితమే పాస్ పుస్తకాల ముద్రణ జరిగి ఆగస్టు 15న ఇవ్వా లని నిర్ణయించినా ఇవ్వలేదు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో ఈ విషయం సీఎం చంద్రబా బు దృష్టికి వెళ్లడంతో పంపిణీకి తేదీలను ఖరారు చేశారు. దీంతో రెవెన్యూ శాఖ పక్కాగా జిల్లాలో ఏర్పాట్లను చేసింది.
ఆర్‌ఐ, డీటీల పర్యవేక్షణలో సభలు
జిల్లాలో 27 మండలాల్లోని 168 గ్రామాల్లో 82,500 పాస్ పుస్తకాల పంపిణీకి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా మండలాల్లో డిప్యూటీ తహశీల్థార్ లేదా రెవెన్యూ ఇనస్పెక్టర్ పర్యవేక్షణలో రైతులకు రాజముద్రతో కూడిన పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంలోనే రైతులకు గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోనున్నారు. ముద్రణ పూర్తయిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో పలు తప్పులు దొర్లాయి. వెబ్‌ల్యాండ్‌లో ఉన్నవాటినే ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతోను కొన్ని వచ్చాయి. జిల్లాలో మూడు వేలకు పైచిలుకు ఈ విధంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో తిరిగి వాటిల్లో తప్పులను సరిదిద్దడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానంగా యజమాని పేరు, ఫొటో, విస్తీర్ణం, ఎల్‌పీఎం నెంబర్, సర్వే నెంబర్, జాయింట్ సర్వే నెంబర్లు, సరిహద్దులు తదితర అంశాలపై ఆకర్షణీయంగా వీటి ముద్రణ జరిగింది.