5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:32 AM
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు నూరుశాతం హాజరు కావాలి
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం రూరల్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణపై జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ నాగరాణి మంగళవారం సమీక్షించారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు, విద్యార్థులకు తాగునీరు, భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఈవో ఈ.నారాయణ, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి
భీమవరం టౌన్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం భీమవరంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చే యాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదే శించారు. పట్టణంలో ట్రాఫిక్, రోడ్లు ఆక్రమణ, వాహన పార్కింగ్, ర్యాష్ డైవ్రింగ్, తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రవాణా శాఖల అధికారులు, ఆటో డైవ్రర్స్ యూనియ న్, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలతో కలెక్టర్‌తో పాటు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సమీక్ష నిర్వహించారు. ప్రజలు, విద్యార్థులు ట్రాఫిక్‌పై క్రమశిక్షణతో మెలగాలని సూచించా రు. ఆటో డైవ్రర్లు, ఆర్టీసీ డైవ్రర్లతో సమావేశాలను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పాఠ శాలల, కళాశాలల బస్సులన్నీ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోతోందని, రూట్ ప్లాన్ అమలు చేయాలని డీటీవోకు సూచించారు. రోడ్డు మార్జిన్ వైట్ లైన్ దాటి వాహనాలు పార్కింగ్ చేస్తే అపరాధ రుసుం విధించాల న్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, ఏఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, డీఎస్పీ శ్రీవేద, ఆర్టీవో కృష్ణారావు, ఆర్టీసీ ఆర్‌ఎం వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.