ముఖ్యమంత్రి ప్రోగ్రాం కమిటీ కన్వీనర్‌గా పాందువ్వ శ్రీను
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:12 AM
ముఖ్య మంత్రి చంద్రబాబు కార్యక్రమాల సమన్వయకర్తగా మంతెన వెంకట సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) నియమితులయ్యారు.
భీమవరం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి చంద్రబాబు కార్యక్రమాల సమన్వయకర్తగా మంతెన వెంకట సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను) నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీలో నమ్మినబంటుగా పాందువ్వ శ్రీను గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో ఆయనకు సన్ని హిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యక్రమాల పర్యవేక్షణలో కీలకంగా వ్యవహ రిస్తు న్నారు. తాజాగా ప్రభుత్వం సమన్వయకర్తగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సహాయ మంత్రి హోదాను కల్పించింది. సమన్వయకర్తగా నియమితులైన సత్యనారాయణ రాజు సోమవారం సీఎం చంద్రబాబును కలిశారు. పార్టీ వ్యవహారాల్లో ఇప్పటిదాకా తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, తనకు అప్పగించిన అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఆయన భుజం తట్టి అభినందించారు. సమన్వయకర్తగా నియమించడంతో ఉండి నియోజ కవర్గంలోని గ్రామాలతో పాటు స్వగ్రామం ఉండి మండలం పాందువ్వలో సందడి వాతావరణం నెల కొంది. మండల తెలుగుదేశం పార్టి మాజీ అధ్య క్షుడు మంతెన సూర్యనారాయణరాజు,సర్పంచ్ యామిని ప్రియాంక, చిట్టిబాబు, చంటిరాజు, రాం బాబు రాజు, ఎంఎస్ రాజు, రాజేష్ ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో స్వీట్లు పంచి పెట్టారు.