కైకలూరు పంచాయతీలో రూ.8 కోట్ల అవినీతి
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:26 AM
కైకలూరు పంచాయతీలో రూ.8.08 కోట్ల అవినీతి వెలుగు చూసింది.
సర్పంచ్ నవరత్నకుమారి సస్పెన్షన్
కైకలూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): కైకలూరు పంచాయతీలో రూ.8.08 కోట్ల అవినీతి వెలుగు చూసింది. సర్పంచ్ డీఎం.నవరత్నకుమారి రూ.4.04కోట్లు అవినీ తికి పాల్పడినట్లు ప్రత్యేక విచారణలో వెల్లడవడంతో ఆరు నెలల పాటు సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరగడంతో జనవరి 18న సర్పం చ్ చెక్‌పవర్‌ను నిలిపివేశారు. అనంతరం పూర్తిస్థాయి లో జరిగిన విచారణలో రూ.8.08కోట్ల అవినీతి జరిగిన ట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మొత్తంలో సర్పంచ్ రూ.4.04 కోట్లు అవినీతికి పాల్పడడంతో ఆరు నెలలు పాటు సర్పంచ్ పదవి నుంచి తొలగించారు. సర్పంచ్ పదవీకాలంలో పనిచేసిన మరో నలుగురు పంచాయతీ కార్యదర్శులు రూ.4.04కోట్లు వెరసి మొత్తం రూ.8.08 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.
నేడు తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక..
సర్పంచ్‌ను సస్పెండ్ చేయడంతో ఉప సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ మంగినేని పోతురాజు గత ఏడాది మే 2న మృతి చెందారు. మిగిలిన సభ్యుల్లో ఒకరిని తాత్కాలిక సర్పంచ్‌గా ఎన్నుకునేందుకు డీపీవో కె.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం తాత్కాలిక సర్పంచ్‌ను ఎన్నుకునేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి పి.ప్రసాద్ తెలిపారు.