Share News

వరి విత్తనాలు వచ్చేశాయ్‌..

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:05 AM

సార్వా సీజన్‌ ఆరంభం అ యింది. జిల్లాలో ఇప్పటికే రైతుల నుం చి రైతులు వరి విత్తనాలను సేకరిం చుకుని వరి నారుమళ్లకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు సంబంధించి అవస రమైన విత్తనాలను సిద్ధంగా ఉంచిన ట్టు జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది.

వరి విత్తనాలు వచ్చేశాయ్‌..

సబ్సిడీపై విత్తనాలు.. 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు

జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో..

ఏలూరుసిటీ, జూన్‌ 10(ఆంధ్ర జ్యోతి):సార్వా సీజన్‌ ఆరంభం అ యింది. జిల్లాలో ఇప్పటికే రైతుల నుం చి రైతులు వరి విత్తనాలను సేకరిం చుకుని వరి నారుమళ్లకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు సంబంధించి అవస రమైన విత్తనాలను సిద్ధంగా ఉంచిన ట్టు జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది. జిల్లాలో ఈ ఏడాది 2,22,347 ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా నిర్ణయించగా దీని కి సంబంధించి 11,117 ఎకరాల్లో నారు మళ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. జిల్లాకు సంబంఽధించి 10,721 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచ నా వేశారు. దీనికి సంబంధించి విత్త నాలు సిద్ధంగానే ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది. సార్వా వరి సాగుకు సంబంధించి తణుకులో ని ఏపీ సీడ్స్‌ నుంచి జిల్లాలోని రైతు సేవా కేంద్రాలకు విత్తనాలు సరఫరా చేసినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏపీ సీడ్స్‌ ద్వారా సర్టిఫైడ్‌ సీడ్స్‌ రైతు సేవా కేంద్రాలకు పంపుతున్నారు. రైతులు తమకు కావాల్సిన విత్తనాల కోసం తమ పేరు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే సబ్సిడీపై అందజేస్తారు. జిల్లాకు సంబంధించి ఏపీ సీడ్స్‌ నుంచి ఆరు వేల క్వింటాళ్ల వరి విత్తనాలు రైతు సేవా కేంద్రాలకు చేరుకున్నాయి. ప్రధానంగా ఎంటీయూ 1318, ఎంటీయూ 7029, ఎంటీయూ 1064, బీపీటీ 5204, ఎంటీయూ 1061 రకాలతోపాటు ఈసారి సన్న రకమైన ఎంటీయూ 1224 రకం విత్త నాలను సిద్ధంగా ఉంచారు.

సబ్సిడీపై విత్తనాలు

రైతు సేవా కేంద్రాల వద్ద తమ పేరు రిజిస్టర్‌ చేసుకున్న రైతులకు స బ్సిడీపై విత్తనాలు అందజేస్తున్నారు. ఒక విత్తనం బస్తా రూ.1,260 కాగా కిలోకి రూ.5 చొప్పున 30 కిలోలకు రూ.150 సబ్సిడీగా అందిస్తున్నారు. ఒక్కొక్క వరి విత్తనం బస్తా రూ.1110 లకు రైతులకు లభిస్తుంది.

50 శాతం రాయితీపై..

పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జను ము, పిల్లిపెసర విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఏడు వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులు జిల్లాలోని రైతు సేవా కేంద్రాలకు సర ఫరా చేశారు. ఎకరానికి జీలుగ, జను ము విత్తనాలు 10 కిలోలు చొప్పున, పిల్లిపెసర విత్తనాలు 10 కిలోలు చొప్పున 50శాతం రాయితీపై అందజే స్తున్నారు. జిల్లాలో అవసరం మేరకు ఇప్పటికే ఏపీసీడ్స్‌ నుంచి ఆరు వేల క్వింటాళ్ల వరి విత్తనాలను రైతు సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాం.. ప్రస్తుతం జిల్లాలో నారుమళ్లు వేస్తు న్నారంటూ జిల్లా వ్యవసాయ శాఖాధి కారి షేక్‌ హబీబ్‌ బాషా తెలిపారు.

Updated Date - Jun 11 , 2025 | 01:06 AM