Share News

కొనుగోళ్లకు రెడీ

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:02 AM

ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా నుంచి ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని జిల్లా నుంచి సేకరించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం ఆరుగొలనులో పౌరసరఫరాల మంత్రి నాదేండ్ల మనోహర్‌ సోమవారం తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

కొనుగోళ్లకు రెడీ

నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంజిల్లాలో 5 లక్షల టన్నుల లక్ష్యం

వాతావరణం ప్రశాంతం

మాసూళ్లకు సిద్ధమవుతున్న రైతులు

48 గంటల వ్యవధిలోనే సొమ్ములు జమ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా నుంచి ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని జిల్లా నుంచి సేకరించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం ఆరుగొలనులో పౌరసరఫరాల మంత్రి నాదేండ్ల మనోహర్‌ సోమవారం తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో 252 కేంద్రాలు ద్వారా ఖరీఫ్‌ ధాన్యం సేకరి స్తారు. కేవలం 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు. ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. మొంథా తుఫాను నుంచి రైతులు గట్టెక్కారు. నష్టం తక్కువగా ఉండడంతో రైతులు కాస్త ఊరట పొందారు. ఖరీప్‌ మసూళ్లకు సిద్ధమవుతున్నారు. నవంబరు 15 నుంచి జిల్లాలో మాసూళ్లు ముమ్మరం కానున్నాయి. వాతావరణం ప్రస్తుతం సహకరిస్తోంది. ఎండ వాతావరణం నెలకొంది. కొన్ని రోజులపాటు ఇదే తరహాలో సహకరిస్తే రైతులు ధాన్యం విక్రయించడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. జిల్లాలో ప్రస్తుతానికి 1.20 కోట్ల సంచులను కూడా సిద్ధం చేశారు. మిల్లులకు లక్ష్యాలను కేటాయించారు. మరాడించిన తర్వాత మిల్లర్ల నుంచి బియ్యాన్ని త్వరతగతిన సేకరించే కార్యాచరణను కూడా రూపొందించారు. గడచిన రబీలో కొద్దిపాటి సొమ్ములను రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగింది. ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయాలని సంకల్పించింది. అక్టోబరులోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాలని నిర్ణయించారు. మొంథా తుఫాను ప్రభావంతో వాయిదా వేసుకున్నారు. వాతావరణ మంతా ఇప్పుడు రైతులకు అనుకూలంగా ఉంది. దాంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. భారత ఆహార సంస్థకు ఖరీఫ్‌ బియ్యాన్ని అప్పగించనున్నారు. దానివల్ల గోదాముల సమస్య కూడా తలెత్తదు. తేమ శాతం సమస్యను అధిగమించేలా కొనుగోలు కేంద్రాల్లోనూ, మిల్లర్ల వద్ద ఒకే రకమైన ఉపకరాణలను సిద్ధం చేశారు. రెండింటి మధ్య తేడా వేస్తే తహసీల్దార్‌తో కూడిన కమిటీ పరిశీలించనుంది. అంతిమ నిర్ణయం కమిటీదే. ఇలా తేమ సమస్యను అధిగమించేలా ప్రభుత్వం పరిష్కారం చూపింది. రైతులు ఆరుదల ధాన్యం అప్పగిస్తే పూర్తి స్థాయిలో మద్దతు ధర లభించనుంది.

నేడు మంత్రి నాదెండ్ల పర్యటన

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనున్నట్టు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిగూడెం హౌసింగ్‌బోర్డు రైతుబజార్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం చాక్లెట్‌ ఫ్యాక్టరీ యూనిట్‌ ప్రారంభించనున్నారు. ఆరుగొలనులో డొక్కా సీతమ్మ విగ్రహ ఆవిష్కరణ, ప్రత్తిపాడు నుంచి కొత్తూరు వరకూ రూ.2.97 కోట్ల విలువ గల రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనున్నట్టు తెలిపారు.

Updated Date - Nov 03 , 2025 | 12:02 AM