ధాన్యం సొమ్ములు చెల్లింపులో రికార్డు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:17 AM
ఖరీఫ్ సీజన్‌కు సంబంధిం చి ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈసారి విశేషమేమి టంటే ఇప్పటివరకు జిల్లాలో 290 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,550 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి పూర్తిస్థాయిలో రూ.ఆరు కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఇప్పటి వరకు 3,550 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
పూర్తిస్థాయిలో రూ.ఆరు కోట్లు చెల్లింపులు
ఏలూరుసిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌కు సంబంధిం చి ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈసారి విశేషమేమి టంటే ఇప్పటివరకు జిల్లాలో 290 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,550 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి పూర్తిస్థాయిలో రూ.ఆరు కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోపు ధాన్యం చెల్లింపులు చేయాల్సి ఉండగా అంతకంటే ముందు గానే కొంతమందికి గంటలో, కొందరికి నాలుగు గంటల్లోనే చెల్లింపులు చేయడం రికార్డుగా చెప్పవచ్చు. జిల్లాలో ఈసారి ధాన్యం కొనుగోలుకు 234 ఆర్‌ఎస్‌కేలను గుర్తించారు. వీటికి అనుబంధంగా 103 సహకార సంఘాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మొత్తం 4లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 17లోపు తేమశాతం ఉన్న ధాన్యాన్ని ధర క్వింటాల్‌కు ఏ–గ్రేడ్‌కు సంబం ధించి రూ.2,389, కామన్ రకానికి రూ.2369లకు కొనుగోలు చేస్తున్నారు. ఆపై తక్షణం ఎఫ్‌టీవో జనరేట్ చేసి మిల్లర్లు అథెంటికేషన్ పూర్తయిన వెంటనే ఽధాన్యం సొమ్ములను రైతులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిం చింది. దీంతో ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే ధాన్యం సొమ్ములు రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుతున్నాయి. ‘జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈసారి రికార్డ్ స్థాయిలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి మొత్తం పేమెంట్ రూ.6 కోట్లు చెల్లించాం’ అని సివిల్ సప్లయిస్ డీఎం పి.శివరామమూర్తి తెలిపారు.