ముమ్మరంగా వరి కోతలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:07 AM
మండలంలో చాట్రాయి, బూరుగుగూడెం, ఆరుగొలనుపేట గ్రామాల్లో ఖరీఫ్ వరి కోతలు చేపట్టారు.
చాట్రాయి మండలంలో నెల రోజులు ముందే మాసూళ్లు
చాట్రాయి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలో చాట్రాయి, బూరుగుగూడెం, ఆరుగొలనుపేట గ్రామాల్లో ఖరీఫ్ వరి కోతలు చేపట్టారు. 1010 రకం నెల రోజులు ముందే కోతకు రావటంతో మిషన్లతో మాసూలు చేస్తున్నారు. 75 కేజీల ధాన్యం బస్తా రూ.1300 ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్న 1224 రకం వరి మరో 15 రోజుల్లో కోతకు వస్తుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ వరి, రబీ మొక్కజొన్న పంట కూడా నెల ముందే చేతికి రావడంతో మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది. రబీ మొక్కజొన్న క్వింటాలుకు రూ.300, 400 ధర వస్తుందని రైతులు చెబుతున్నారు.